• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Pagadalu Parijatalu

Pagadalu Parijatalu By Jillella Balaji

₹ 120

ఇది బాలాజీ కతలా?

సీమచింతకాయ గుత్తులా?

జిల్లేళ్ళ బాలాజీ. ఇది సాహితీ యవనిక మీద ఇటు డైరెక్టు తెలుగు కథలు అటు అనువాదం లోనూ ప్రత్యేకంగా ఒకరు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. బాలాజీ ఇప్పటి వరకూ 1) మాట్లాడే పక్షి 2) మైత్రీవనం 3) సిక్కెంటిక 4) వొంతు (5) ఉండు నాయినా, దిష్టి తీస్తా! అన్న ఐదు డైరెక్టు కథా సంపుటాలను వెలువరించాడు.

అలాగే తమిళం నుండి తెలుగులోకి... 1) కాలప్రవాహం 2) జీవనాడి 3)జయకాంతన్ కథలు 4) నైలు నది సాక్షిగా... అన్న నాలుగు కథా సంపుటాలు విదల కాగా, 5) శిథిలం (బవా చెల్లదురై కథలు) ప్రచురణలో ఉన్నది.

అలాగే 1) కల్యాణి (దీనికే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.) 2) ఒక మనిషి, ఒక ఇల్లు, ఒక ప్రపంచం. 3) గంగ ఎక్కడికెళుతోంది? 4) ప్యారిస్కు పో! 5) జయకాంతన్ 2 నవలికలు 6)రాజేష్ కుమార్ 3 డిటెక్టివ్ నవలలు, 7)యామం 8) అలల సవ్వడి 9)సంచారం మొదలైన 13 నవలలు అనువదించాడు.

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమన్న సామెతకు బాలాజీ ఒక తిరుగులేని నిదర్శనంగా నిలుస్తాడు. బాగా చదువుకున్నవాడు. గత ముప్పై ఏండ్లుగా పిల్లలకు తెలుగును బోధిస్తున్న ఉపాధ్యాయుడు. తన మాటల్లో వినయం, సౌశీల్యం ఉట్టిపడుతూ వుంటాయి. స్నేహ సౌభ్రాతృత్వాలు పరిమళిస్తుంటాయి. మొత్తం మీద ఓ మంచిమనిషి అని కచ్చితంగా చెప్పుకోదగిన వ్యక్తి బాలాజీ.

బాలాజీ ఇంటి పేరు జిల్లేళ్ళ. అది విన్నప్పుడల్లా నా మనసులో ఒక భావం కదులుతుంటుంది. అదేమిటంటే జిల్లేళ్లు సామాన్యంగా ఎవ్వరూ ఇష్టపడని చెట్లు. కానీ అవే జిల్లేళ్ళు పరమశివునికి అత్యంత ఇష్టమైనవి. వాటి పూలు శివుని కంఠాన్ని అలంకరించగానే అవి అందరికీ ఆమోదమవుతాయి. ఇదొక వైచిత్రి.

అలాగే ఒక సాధారణ సామాజిక వర్గానికి చెందిన బాలాజీని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. కానీ అదే బాలాజీ ఉన్నత చదువులు చదువుకుని, మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే ఇటు తెలుగు కథలు, అటు తమిళం నుండి అనువాద రచనలు చేస్తూ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారంతో పాటుగా అనేక సాహితీ సంస్థల నుండి ఎన్నో పురస్కారాలు అందుకోవటం ద్వారా తాను సమాజంలోని అన్ని సామూహిక వర్గాలకు అత్యంత ఆప్తుడుగా మారిపోయాడు. అది తలుచుకోగానే బాలాజీ పట్ల నా ఆత్మీయత మరింతగా పెరిగిపోతుంటుంది...................

  • Title :Pagadalu Parijatalu
  • Author :Jillella Balaji
  • Publisher :Parvati Viswam Prachuranalu
  • ISBN :MANIMN6119
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2021
  • Number Of Pages :115
  • Language :Telugu
  • Availability :instock