• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Paisala Muchatlu

Paisala Muchatlu By M Ramprasad

₹ 349

అందరికీ చెప్పాలనే..

ఆర్థిక విధానాలు అర్థమైతే జీవితం సరళంగా సాగిపోతుంది. అదే కాసుల సూత్రాలు మి కల్ ఈక్వేషన్స్లో బుర్రకు ఎక్కకపోతే.. జిందగీ గజిబిజిగా తయారవుతుంది. ఉన్నతో ద్యోగం చేస్తున్నా, వ్యాపారం సక్సెస్ఫుల్లా సాగినా, ఆస్తులెన్ని కూడబెట్టినా.. సరైన ఆర్థిక పంథా ఎంచుకోకపోతే ఏదో ఒకనాడు కాసులు గళగళలు చెవికి వినిపించకుండా పోతాయి. తీరిగ్గా అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా గుండెను పిండేస్తాయి. చేసిన పొరపాటుకు 'బ్రహ్మ రాత' అని విధిని నిందిస్తూ భారంగా కాలం గడిపే స్తారు. మీ జీవితం ఇలా కావొద్దంటే.. సరైన ఆర్థిక విధానాలు పాటించడం ఒక్కటే పరి ష్కారం. పొదుపు మంత్రం పాటించాలని అందరూ అనేదే! వచ్చిన ఆదాయాన్ని సద్విని యోగం చేసుకోవాలని పెద్దల మాట. సంపాదనను ఎలా పంచుకోవాలి, ఇంకెలా పెంచుకోవా లన్నది ముఖ్యం. వీటితోపాటు ఏ పొరపాట్లు జీవితాన్ని కుదేలు చేస్తాయో తెలుసుకోవడం అనివార్యం. ఈ విషయాలన్నిటిపై కూలంకషంగా వివరించే ప్రయత్నమే ఈ 'పైసల ముచ్చట్లు' వ్యాస సంకలనం.

దెబ్బతిన్నాక నిబ్బరించుకోవడం మధ్యతరగతికి రివాజు! ఉన్నది కాస్తా ఊడి.. సర్వమంగళం పాడిన తర్వాత అనుభవం' వచ్చిందని గొప్పగా చెప్పుకొనే మాజీ శ్రీమంతులూ కనిపిస్తారు. అయితే, ఉన్నదాన్ని ఉన్నతంగా అనుభవించడం ఎలాగో ఈ పుస్తకంలో తెలియజేశాను. గడి చిన ఎనిమిదేండ్లలో ఓ నాలుగువేల కుటుంబాలు నన్ను ప్రత్యక్షంగా కలిశాయి. వారి ఆర్థిక స్థితిగతులను తెలియజేసి, వారి సమస్యలకు పరిష్కారం కోరాయి. నా అనుభవంతో వారికి సరైన సూచనలు అందించగలిగాను. ఆయా కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా ఉండటం ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా నాకు సంతృప్తి కలిగించే విషయం. ఈ అనుభవం కొందరికే పరి మితం కావడం సబబు కాదని నా శ్రేయోభిలాషుల అభిప్రాయం! అలాగని అందరినీ కలిసి వాళ్ల వాళ్ల సమస్యలు విని, వారికంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికలు సూచించడం సాధ్య మయ్యే పనికాదు కదా! అందుకే కాలమిస్టుగా అవతారమెత్తాను. రెండేండ్లుగా నమస్తే తెలం గాణ దినపత్రిక ఆదివారం అనుబంధం 'బతుకమ్మ'లో 'పైసలముచ్చట్లు' కాలమ్ నిర్వహిస్తు అన్నాను. సుమన్ టీవీ ద్వారా యూట్యూబ్ వేదికగానూ ఎన్నో ఆర్థిక అంశాలను సవివరంగా చర్చించాను. పాఠకులు, వీక్షకులు చాలామంది వీటిని విశేషంగా ఆదరించడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

'పైసల ముచ్చట్లు' కాలమన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నవారిలో కొందరు నా ప్రయత్నాన్ని అభినందించారు. ఈ వ్యాసాలను ఒక సంకలనం రూపంలో తీసుకురావాలని సూచించారు. వారి సలహా మేరకు ఆర్థిక పాఠాలన్నీ ఒక దండగా గుదిగుచ్చి.. పుస్తక రూపంలో అందిస్తే. అది ఎందరికో ప్రయోజనాన్ని చేకూరిస్తుంది కదా అనిపించింది. అలా 'బతుకమ్మ'లో ప్రచురి.............................

  • Title :Paisala Muchatlu
  • Author :M Ramprasad
  • Publisher :Rp Welth Private Limited
  • ISBN :MANIMN6043
  • Binding :Paerback
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :172
  • Language :Telugu
  • Availability :instock