₹ 100
మద్రాసు నుంచి హోరా మేయిల్ ఎక్కి మర్నాడు ఉదయమే నిడదవోలులో దిగాం అమ్మ, నాన్న,, నేను।"ఇచట నరసాపురానికి, భీమవరానికి మరవాలేను " - ఈ బోర్డు ఏటా అమలాపురానికి వెళ్లడానికిదే రైలులో ప్రయాణం చేస్తూ చదువుతూ ఉండేదాన్ని। ఇప్పుడా ఊర్లో దిగి తణుకు వెళ్లాలన్న మాట ! ఓ గంట అక్కడ సిమెంట్ బెంచి మీద కూర్చుని గడిపాక తనుకెళ్లే రైలు అంటూ అక్కడున్న వాళ్ళు లేచి రెండో ప్లాట్ ఫారం పైకి వెళ్లడం చూసి, నాన్నగారు, అమ్మ నేను కూడా అటు వెళ్లం। ఈలోగా పొగలు కక్కుతూ రైలు వచ్చి ఆగింది। మెల్లిగా సామానుతో ఎక్కం రైలు। తణుకు స్టేషన్ వచ్చింది।
నేను ముందు దిగి ట్రంకు పెట్టె, నాన్న తోలుపెట్టే ఒక్కొక్కటి నాన్న అందిస్తుంటే గబగబా అందుకున్నాను। అమ్మ మరచెంబుతో దిగింది। మెల్లిగా సమానుచ్చుకుని స్టేషన్ బయటికి వచ్చాము రేకుల షెడ్డుదాటి। సామాన్లతో మెట్లుదిగి ఎదర ఉన్న పెద్ద రావిచెట్టు మొదట్లో ఉన్న చేష్టా మీద సామనుంచి నిలబడ్డాం అమ్మ నేను। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకాం చదివి తెలుసుకొనగలరు ।
- Title :Palangi Kathalu
- Author :Smt Bhamidi Kamaladevi
- Publisher :Sirakadamba Publications
- ISBN :MANIMN1145
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :outofstock