₹ 45
జీవితంలో మొదటిసారి నాన్న మీద కోపమొచ్చింది. బాధతో మనసు మెలిపెట్టినట్లైంది. దుఃఖంతో గొంతు పచ్చిగా మారింది. నా ప్రమేయం లేకుండానే కన్నీళ్ళు చంపల్ని తడుముకుంటూ దిండులోకి పరుగులు తీశాయి.
దుఃఖం వెక్కిళ్ళలోకి మరి ఎంతసేపైందో........
"అక్కా...." తమ్ముడు ఆదిత్య కుదుపుతో ఉలిక్కిపడ్డాను.
కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చున్నాను. "ఏంటి?" గొంతు సరిగ్గా పెగలలేదు నాకు.
"ఏడుస్తున్నావా?" వాడు లేచి కూర్చున్నాడు. నాకంటే నాలుగేళ్ళు తక్కువ వాడు. ఇప్పుడు ఎడో తరగతే.
వెంటనే నేను జవాబు చెప్పలేదు. ఇంటి నుండి బయల్దేరేటప్పుడు "తమ్ముడు జాగ్రత్త... రాత్రిపూట వాడు కంగారు పెడతాడేమో..... " నన్న అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఆ బాధ్యత నా బాధకు అడ్డుకట్ట వేసింది. తరువాత ఏం జరిగిందో ఈ కథ చదివి తెలుసుకొనగలరు.
-దొరవేటి.
- Title :Palle Kadhalu
- Author :Doraveti
- Publisher :SriRaghavendra Publications
- ISBN :MANIMN0684
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :118
- Language :Telugu
- Availability :instock