లేక్ రిజ్ అపార్ట్మెంట్ ఒకే ఫ్లోర్లో ఉంటున్నా, వాళ్ళ రెండు ఫ్లాట్స్ మధ్యనున్న లిఫ్ట్ తప్పితే సాగర్కి, ఫ్లాట్లో కన్నా మద్యం మత్తులోనే ఎక్కువగా ఉండే అరవింద్ రావుకి ఏదీ కామన్ గా ఉండదు.
62 ఏళ్ళ అరవింద్ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. భార్య చనిపోయి ఐదేళ్ళైంది. ముగ్గురు పిల్లలు. కాని ఒంటరిగానే ఉంటాడు. సాగర్ 29 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగి. స్వస్థలం వైజాగ్. వృత్తిరీత్యా బెంగుళూరులో ఉంటున్నాడు. అరవింద్కేమో చుక్క లేనిదే పొద్దెక్కదు, పొద్దు దిగదు.
సాగర్కి కనీసం ఫ్రూట్ బీర్, బ్రీజర్ లాంటివి కూడా అలవాటు లేదు.
అరవింద్ నెరిసిన, పల్చబడిన జుట్టు, మాసిన గెడ్డంతో ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తుంటే, క్లీన్ షేవ్, నల్లటి ఒత్తైన జుట్టు, గోధుమ వర్ణం, వర్కౌట్ చేసిన దేహ ధారుడ్యంతో ఆరడుగుల ఎత్తుతో లూయీ ఫిలిప్ యాడ్లో మోడల్ ఉంటాడు సాగర్.
అరవింద్ లేక్ రిజ్ అపార్ట్మెంట్లో దాదాపు మూడు సంవత్సరాల నుండి ఉంటే, సాగర్ వచ్చి ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. అరవింద్ను కలవడం అతనికి ఇదే మొదటి సారి.
అది తను ఆఫీసులో జాయిన్ అవ్వాల్సిన రోజు, అందుకనే కాస్త త్వరగానే బయల్దేరాడు................