ఉగాది మన పర్వదినం
పచ్చడి రుచి కమ్మదనం
తేట తెలుగు తియ్యదనం
అందరికి పండుగ దినం
మామిడికాయ తరగాలి.
చింత రసం చేయాలి.
బెల్లం, వేప కలపాలి
పచ్చడి రుచి చూడాలి
తెలుగు ఉగాది వచ్చేను
సంతోషాన్ని తెచ్చేను
ఆనందాన్ని పంచేను
కోయిల పాట పాడేను