పండుగలు, ఉత్సవాలు, ప్రజా సంస్కృతి
మనం నిత్యం జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. పండుగలు, ఉత్సవాలు అన్నీ మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించి అంటే వ్యవసాయం, పశు పోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతుంటాయి. కొన్ని పండుగలు పూర్తిగా మతనమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇలా పూర్తిగా విడదీసి చూడ్డం కూడా కష్టం. మానవుని ఉత్పత్తికి, ప్రకృతిపై విజయాలకు సంబంధించిన పండుగలోనూ మళ్లీ మతపరమైన నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. అదే సమయంలో పూర్తిగా మతపరమైన కథలపై ఆధారపడిన పండుగల్లోనూ వెదికి చూస్తే మానవ సమూహాల అభివృద్ధికి సంబంధించిన అనేక చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. అందువల్ల మనం పండుగలు, ఉత్సవాలు, జాతరలు వంటి వాటిని ఏవిధంగా చూడాలీ, ఏ విధంగా ఈ సందర్భాల్లో పాత్ర వహించాలి అన్న ప్రశ్న ముందుకొస్తుంది. దీనికి సమాధానం ఒకటే పండుగలను, ఉత్సవాలను మూఢనమ్మకాల పేరుతో మొత్తంగా కొట్టి పారేయకూడదు. అదే సమయంలో వాటిలోని అన్ని అంశాలనూ అంటే మూఢ విశ్వాసాలను, మూఢాచారాలను, ఆధ్యాత్మిక విషయాలను భుజాన వేసుకుని మోయకూడదు.
మనుగడ కోసం మానవుడు ప్రకృతితో సాగించిన పోరాటంలో ఒక్కో విజయం సాధించడం ద్వారానే అభివృద్ధి పథంలో ముందుకుపోతూ వచ్చాడు. ప్రకృతితో మనిషి ఒంటరిగా పోరాడలేదు. సామూహికంగా, సమిష్టిగా పోరాడాడు. అందువల్ల ప్రకృతిపై విజయం సాధించినప్పుడు మానవులు సమిష్టిగానే సంతోషం పంచుకున్నారు. అవే.............