• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pandurangadu Paduguru Dongalu

Pandurangadu Paduguru Dongalu By Vasundhara

₹ 75

పాండురంగడు పదుగురు దొంగలు

ఒకానొక గ్రామంలో ధర్మరాజు, శాంతమ్మ అనే దంపతులుండేవారు. వివాహమైన పది సంవత్సరాలవరకూ వారికి పిల్లలు కలగలేదు. పిల్లల కోసమని ఆ దంపతులు ఎన్నో పుణ్యతీర్థాలు దర్శించారు. ఒకచోట వారికి అందరి కోరికలూ తీర్చే చిదానందస్వామి గురించి తెలిసింది. తనవద్దకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి మనసులోని మాట చెప్పి, తీరే

ఉపాయం కూడా చెబుతాడట ఆయన.

ధర్మరాజు భార్యతో కలిసి చిదానందస్వామి దర్శనం చేసుకున్నాడు. ఎంతో పేరున్నప్పటికీ ఆయన ఉంటున్న ఆశ్రమం చాలా చిన్నది. అక్కడ జనం కూడా ఎంతోమంది లేరు.

స్వామి ఈ దంపతులను చూస్తూనే, "నా ఆశ్రమం చిన్నదిగా ఉన్నదనీ, ఇక్కడ జనం తక్కువగా ఉన్నారనీ ఆశ్చర్యపోతున్నారుకదూ? నా వద్దకు అందరూ రాలేరు. రాగలిగిన వారందరూ అదృష్టవంతులు. సంతానం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీ కోరిక ఫలించే అవకాశం ఉన్నది. రెండు దినాలు ఆశ్రమంలో వుండండి" అని చెప్పాడు.

దంపతులిద్దరూ ఆశ్రమంలో బసచేశారు. రాత్రి చిదానందస్వామి ఆ దంపతులున్న గదిలోనికి వెళ్లి శాంతమ్మను లేపాడు. శాంతమ్మ ఉలిక్కిపడి లేచింది.

"నీ భర్త ఇప్పుడు నేను సృష్టించిన మాయలో పడి నిద్రపోతున్నాడు. నీకు సంతానం కలగాలంటే ఒక్కటే మార్గమున్నది. నేను సాక్షాత్తూ పాండురంగడు.......................

  • Title :Pandurangadu Paduguru Dongalu
  • Author :Vasundhara
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN6585
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2025
  • Number Of Pages :73
  • Language :Telugu
  • Availability :instock