పండుటాకు
ఒకదాని తరువాత ఒకటిగా ఒకే పద్దతిలో కట్టిన ప్రభుత్వ ఇండ్ల వరుస... రెండు రెండు పోర్షన్లను ఒక్కొక్క ఇల్లుగా, ప్రతి ఇంటికి ఆ చివర నుండి ఈ చివర వరకు పెద్ద ఎత్తు అరుగుతో మొత్తం పది, పన్నెండు ఇండ్ల వరుస...ఇంటికీ ఇంటికీ నడుమ ఖాళీ స్థలం... వెనుకవైపుకు మరొక వరుస ఇండ్లు...ఆ ఇళ్ళను కలుపుతూ ముందు ప్రక్క సన్నని కంకరరోడ్డు... రోడ్డుకు ఆవల కనుచూపుమేరనంతా పచ్చగా నిగనిగలాడుతున్న కర్రతుమ్మచెట్ల చెరువు.
ఒక ఇంటిముందు కళ్ళాపు చల్లి చక్కగా ముగ్గులేసి ఉంటే, మరో ఇంటి ముందు సిమెంటుతో గచ్చుచేసి రంగవల్లులు తీర్చిదిద్ది ఉంది. కొన్ని ఇండ్లముందు వేపచెట్లు, కానుగచెట్లు బలంగా ఏపుగా పెరిగి ఉంటే, కొన్ని ఇండ్లు ఏ అడ్డూ ఆచ్ఛాదనా లేక నగ్నంగా బోసిగా ఉన్నాయి. ఇండ్లల్లో ఆడవాళ్ళ వంటల హడావుడి...
ఇళ్ళ ముందు అరుగుల మీద బడికి వెళ్ళాల్సిన ఆడపిల్లలు తలలు చిక్కు తీసుకుంటూ జడలు వేసుకుంటుంటే మగపిల్లలు పుస్తకాలు, పలకలు సర్దుకుంటున్నారు...................