• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Panneeru Kanneeru

Panneeru Kanneeru By Nandivaada Bheemarao

₹ 120

పన్నీరు కన్నీరు

(నవల)

రాజమండ్రి నించి గోదావరి కట్టమీద పదిమైళ్లు వెళ్ళి అక్కడ కట్ట నించి మళ్ళీ దగ్గిర దగ్గిర పదిహేను మైళ్ళు వెడితే వస్తుంది సిరిపాలెం.

కాలినడకన ప్రయాణం చేసేవారికి ఊరింకా కోసెడు దూరముందనగా ఒక దివ్యదర్శనం అవుతుంది. తూర్పు దిక్కుకి ఎర్రగా, పచ్చగా, తెల్లగా సుద్దకొండలు. మరి రెండు పక్కలికి చిన్న చిన్న ఎర్ర కంకరికొండలు. మధ్యనంతా పచ్చని పచ్చిక బయళ్ళూ, చేలూ, చెట్లూ చేమలు, మధ్యనెక్కడో చిన్న ఊరు. సృష్టికర్త అద్భుతమైన పంచరంగుల పానపాత్ర ఒకటి సృష్టించి ఇక్కడ మరచిపోయి ఉండాలి. ఆ పాత్రకి మధ్యనుంచిన చిన్న బంగారపు పుష్పంలా  ఊరు.

అరుణోదయ సమయంలో ఊరు ప్రవేశించినవాడు ఏ జన్మలోనో మహా పుణ్యం చేసుకొని ఉండాలి. అది ఒక మహత్తరానుభూతి.

ఎక్కడ చూచినా కెంపుల కాంతులే ! పల్లవాధర అరుణిమలే ! గోరంటాకు దాల్చిన లేత తమలపాకుల చేతులే ! మందారాలే ! దానిమ్మగింజలే !

ఎర్రని సూర్యకాంతి రంగురంగుల సుద్దకొండల మీదినుంచి ప్రసరిస్తూ ఆ ప్రదేశాన్నంతటినీ రాగరంజితం చేస్తుంది. తక్కిన రంగుల నన్నింటిని జీర్ణం చేసుకుని...............................

  • Title :Panneeru Kanneeru
  • Author :Nandivaada Bheemarao
  • Publisher :Nandivaada Bheemarao
  • ISBN :MANIMN4418
  • Binding :Papar back
  • Published Date :May, 2023
  • Number Of Pages :127
  • Language :Telugu
  • Availability :instock