• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Para Vidya
₹ 50

శ్రీ గణేశాయ నమః

పరావిద్య

శ్రీవిద్య, పరావిద్య, బ్రహ్మవిద్య, ఆత్మపరమాత్మల లయావిద్య, ఆత్మానాత్మల మాయామేయ విద్య.

అనాద్యనంతం ఉల్లలిత. అక్కడ నిరాకార, నిర్గుణ, నిరంజన, దిక్కాలాద్యనవచ్ఛిన్న పూర్ణం. సర్వజనని. ప్రపంచోల్లాస సమయం ఆసన్నమవుతున్న జాడ గమనించి, అదే అనంతేచ్ఛగా మారి, కదలిక వచ్చింది. ఆ కదలిక లలిత. అనంత ఆద్యచైతన్యం. అప్పటికీ అది అనంతమే. కేంద్ర రహితమే.

తిరిగి తిరిగి ఒక కేంద్రమైంది. అది రాజరాజేశ్వరి. అదే అనంతసాక్షి, అనాద్యనంత చైతన్యం. భావిజగదంకుర బీజం. అయినా అమూర్తం.

తన చైతన్యంలో తన పరాశక్తిని చూసుకొని తనను ఈశ్వరమని భావించింది. ఈ భావమే బ్రహ్మ. స్వదర్శన, ఈక్షత, కామ, తపస్సంకల్పాలతో మాతృమాన, మేయ లక్షణాలను ఆపాదించుకొని శ్రీమహాత్రిపురసుందరిగా అర్థనారీశ్వరిగా శివశక్తులుగా ప్రకాశ - విమర్కాంశ బిందువు అయినది. అందులో ప్రకాశాంశం శివ. విమర్శాంశం శక్తి. ప్రకాశాంశం - పరా. విమర్కాంశం అపరా. దీన్నే మూర్తా మూర్త బ్రహ్మ బిందువు అంటారు. జ్ఞానంతో భావించగలిగే బ్రహ్మం ఇక్కడినించే. జ్ఞానంతో, తర్కంతో, మిగిలిన ప్రజ్ఞతో సాధించే బ్రహ్మ తత్వం ఇంతవరకే. ఆపైన 'న తర్కేణ మతిలాపనీయ', 'యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ'. ఆపైన జ్ఞానంతో పనిలేదు.

అది లయానంతం.

బ్రహ్మ అంటే కామేశ్వరుడు. వ్యాప్తిని కోరినవాడైనాడు. వ్యాప్తి అంటే విక్షేపం...............

  • Title :Para Vidya
  • Author :Anada Ghana Aripiraala Viswam
  • Publisher :Anada Ghana Aripiraala Viswam
  • ISBN :MANIMN3826
  • Binding :Papar back
  • Published Date :July, 2000
  • Number Of Pages :117
  • Language :Telugu
  • Availability :instock