పరమగురు చరణ సన్నిధి
'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్'
థియొసఫీ అనేది శాశ్వత, సనాతన, నిత్యనూతన ధర్మానికి ఆంగ్లంలోని పేరు. అది క్రొత్తది కాదు, మన భారతీయుల యొక్క సనాతనమైన, శాశ్వతమైన, నిత్యనూతనమైన సత్యాన్ని, మనం మర్చిపోయిన జ్ఞానాన్ని మనకు తిరిగి అర్థమయ్యే రీతిలో చెప్పుతుంది. సంస్కృతం మనకు పూర్తిగా అర్థమవ్వడం లేదు. మన జ్ఞానమే మనకు పూర్తిగా అర్థమవ్వటం మానేసింది. చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటి అంటే వేదాలు సంస్కృతంలో వ్రాయబడ్డాయి అని. వేదాలు సంస్కృతంలో వ్రాయబడలేదు. రసాయనశాస్త్రంలోని ఒక పుస్తకాన్ని ఆంగ్లంలో వ్రాసినప్పటికీ, అక్షరాలు ఆంగ్లంలో ఉన్నాయి కాని రసాయనశాస్త్రం ఆంగ్లంలో లేదు. రసాయనశాస్త్రాన్ని వ్రాయడానికి, దానిని అర్థం చేసుకోవడానికి ఆంగ్ల అక్షరాలను ఉపయోగించుకున్నాం తప్ప రసాయనశాస్త్రం ఆంగ్లంలో లేదు. అక్కడ ముఖ్యం ఆంగ్లంలోని అక్షరాలు కాదు, ప్రకృతిలో ఉన్న మూలకాలు ఏది దేనితో కలిస్తే ఎలాంటి....................