స్వామి వివేకానందకు భారతదేశమంటే అత్యంత ప్రీతి. ఈ ఆధునిక యుగంలో క్రొత్త ప్రొడక్ట్స్ ను ప్రవేశపెట్టే ముందు కంపెనీలు ఏ విధంగా మార్కెట్ రిసెర్చి చేసి వాటిని అమలు పరుస్తున్నారో అదే విధముగా స్వామి వివేకానంద దేశమంతా పాదయాత్ర చేసి దేశ పునరుద్ధరణకు మార్గాన్ని కనుగొన్నారు. దారిద్ర్యంతో బాధపడుతూ, సోమరితనంలో నిద్రిస్తున్న తన దేశాన్ని పునురుద్ధరించడానికి ప్రజలతో కార్యతత్పరత, అవిరామంగా కష్టపడి పనిచెయ్యటం మొదలైన గుణాలను పెంపొందించడం అత్యంత అవసరమని గుర్తించారు