'స్వరబ్రహ్మ'కి చక్రపాణి ట్యూన్ చెప్పడమా?!
వాహినీ స్టూడియో కంపోజింగ్ రూం.
విజయా వారి 'మిస్సమ్మ' (1955) చిత్రానికి బాణీలు కడుతున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావుగారు. పింగళి నాగేంద్రరావు గారు ప్రక్కనే కూర్చుని ఉన్నారు. ఆ చిత్రానికి నిర్మాతలు నాగిరెడ్డి - చక్రపాణి. నాగిరెడ్డిగారు వ్యాపారవ్యవహారాలు చూస్తూంటే, చక్రపాణిగారు చిత్రనిర్మాణం పర్యవేక్షించేవారు.
ఆ రోజు సాలూరివారు, పింగళి రాసిన 'బృందావనమది అందరిది...' పాటకి వరస కడుతున్నారు. కానీ ఆయన కట్టిన ఏ ట్యూనూ కూడా చక్రపాణి గారికి నచ్చడం లేదు. బాణీలు ఎంత మధురంగా కడతారో, వ్యంగ్యాస్త్రాలు విసరడంలోను అంతే చతురత ప్రదర్శించగల దిట్ట - రాజేశ్వరరావుగారు..........