ఉపోద్ఘాతము
సంసారచక్రభ్రమణరసికయు, ఘాతలక్షణభావరూపమును, స్థూల సూక్ష్మ విభాగా పన్నకార్యకారణసం మహదాదినిఖిలపరిణామమూలభూతమును, సత్వరజస్తమో గుణాత్మకమును, తన బంధన ఫలవిశేషములచే నిరంతరము బంధింపబడిన వారి కి ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికములను తాపత్రయములచే సంతప్తులగువారికి అవిద్య-అస్మిత-రాగ-ద్వేష-అభినివేషములను పంచకేశములచే పీడింపబడుచున్న ప్రాణులకు అభ్యుదయ నిశ్రేయస సంపత్తి సంపాదనార్ధము అసాధారణ సాధనమును, భగవంతునకు సమ్మతమైనదియు, పరమాత్మభక్తిచే కూడినదియు, తత్త్వజ్ఞాన-విషయవైరాగ్య-సమన్వితమై అష్టాంగయోగధర్మాత్మక మైనందున యోగీంద్రుడైయిన పతంజలి మహాముని ముముక్షువులకు సాధ్యసాధనములతో కూడిన యోగశాస్త్రము అవసరమని గ్రహించి ఉపదేశించెను.
ఆవిర్భావతిరోభావస్వభావసమస్తజన్యభావాః భిన్నమును, ఈ యోగశాస్త్ర కావుననే ఈ యోగశాస్త్రము తెలుసుకోదగినది. ప్రతిపాద్యమైనమోక్షమునకు కావలసిన విభిన్న సాధనములన్నియు వినవలయును, మననము-నిదిధ్యాసనము చేయవలయును మరియు ఆచరణమునందును ఉంచుకొనవలయును.
క్షిప్త-మూఢ-విక్షిప్త అవస్థలయందున్న చిత్తవృత్తులు నశించుటవలన ఏ కాగ్రావస్థయందు సంప్రజ్ఞాత సమాధిని, నిరుద్ధావస్థయందు అసంప్రజ్ఞాత సమాధిని సంపాదించి యోగి పరమకైవల్యమును పొందునని ఈ యోగశాస్త్రమందలి మొదటిదియైన సమాధిపాదమునకు తాత్పర్యము.
ప్రతిఒక్కరును సాధించదగినది మోక్షము. ఇట్టి మోక్షము యోగశాస్త్రమందు దుఖత్రయ అత్యంతాభావ విశిష్టమై అసంప్రజ్ఞాత సమాధిస్వరూపమైనది.
సంసారదశయందు యోగులకు ఒకవేళ తన మనసునందు సమాధిద్వారా ఆత్మస్వరూపదర్శనరూప ప్రాప్తి సంభవించినప్పటికీ అది పరమముక్తి కానేరదు. ఏలయనగా సమాధ్యవస్థయందు దుఃఖకారణ భూతమైన సూక్ష్మసంసర్గముం డుచున్నందువలన తిరోభూతస్వరూపము కారణాత్మకమును అయిన దుఃఖత్రయము సమాధి అనంతరము ఆ మనసునందుండేయుండును. యోగులకు తిరిగి శరీరోపాధి దర్శనము (దుఃఖత్రయము) కలుగుచున్నది. అట్టి దశయందు జీవన్ముక్తి సంభవింపనేరదు. దుఃఖత్రయములు శాశ్వతముగా నశించవలయునన్న దుఃఖత్రయములయొక్క కారణములు నశించుటయందు ఆధారపడియున్నది. ఆ కారణములు నివృత్తియైనచో దుఃఖత్రయనివృత్తివలన..............