₹ 200
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామరెడ్డి) విచిత్ర భావాల విలక్షణ కవి. ఆయన జీవనాను భావాలు, కావ్యాభివ్యక్తి, కథాకథనం, చలనచిత్ర దర్శకత్వం - అన్నిటిలోను వైచిత్రి, వైలక్షణ్యం కనిపిస్తాయి. మనిషి మృదువు, కవిత కటువు, పలికిస్తే మృదుభాషి, కవితలో అహంభావి. వచన పద్యాలతో పద్యాల నడుములు విరగ్గొడతానంటాడు; అంత్యప్రాసలతో అలరిస్తాడు. మొత్తం మీద తెలుగులో తెలివిగల ప్రతిభాన్విత కవి పఠాభి.
శ్రీ శ్రీ ఫిడేలు రాగాల 'ఇంట్రో' లో విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్నాడు. పఠాభి వ్యక్తిత్వంతోనూ, కవిత్వంలోను విచిత్రమైన సౌందర్యం ఉంది. 'నాకు విచిత్రంబగు భావాలు కలవు, నా కన్నులందున టెలిస్కోపులు, మయిక్రాస్కోపులున్నవి (ఆత్మకథ) అనటంలో కవి రూపంలో ఉన్న విజ్ఞాని కనిపిస్తాడు. కవిత్వంలో గణితాన్ని గణితంలో కవిత్వాన్ని చూడగల మేధావి పఠాభి.
- ఆర్వీయస్ సుందరం