• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pathithulu Marikonni Kathalu

Pathithulu Marikonni Kathalu By Gopi Chand

₹ 175

దేవుని జీవితం

“దేవుడున్నాడా, లేదా?” అనే ప్రశ్న పాతబడిపోయింది ; ఈ రోజుల్లో ఈ ప్రశ్న వేస్తే రసాయన శాస్త్రజ్ఞులు, "భగవంతుడు అనవసరంగా సృష్టింపబడ్డ తార్కికుల ఊహా మాత్రుడు" అంటారు. నవనాగరికులం అనుకునేవాళ్ళు, "ఇన్నాళ్ళ నుంచీ ఏం చేస్తున్నావురా అబ్బాయ్; ఇప్పుడు లేచావ్" అంటారు.

15వ శతాబ్దం దగ్గర నుంచీ ఈ విషయం ఆలోచించేవాళ్ళే లేరు. అప్పటికప్పుడే షేక్స్పియర్ గారికి "దేవుడు లేడు" అన్నది షా గారి "కారవాన్ ఆఫ్ ది క్యూరియన్" లోని ఓ పాత్ర.......

ఒక నల్లమ్మాయి దేవుని కోసం వెతకటం ప్రారంభించింది. ఏం చేస్తే దేవుడు కనబడతాడని విన్నదో అవన్నీ చేసింది. ఎక్కడ దేవుడు వుంటాడని విన్నదో అక్కడికల్లా వెళ్ళింది. ఒకరోజు ప్రయాణంచేస్తున్న ఒక గుంపుని చూచింది.

"మీరు వెదికేది దేవుని కోసమా?" అని వెంటనే అడిగింది. వాళ్ళ పరిహాసానికి డొక్కలు చెక్కలయేట్టు నవ్వుకున్నారు. నిద్రించేవాళ్ళు మేల్కొని "ఏమిటి?" అని అడిగి ఆ అమ్మాయి చిత్రమైన ప్రశ్నవిని, అందరూ కలిసి గగ్గోలుగా నవ్వుకున్నారు. "పిచ్చిపిల్ల! ఎప్పటి దేవుడూ, ఎప్పటి కథా!" అని ఆశ్చర్యపడ్డారు.

కాని యిన్ని సంగతులు తెలుసుకున్న నేను కూడా దేవుడున్నాడా! అనే ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పటానికీ, చెప్పుకోవటానికి ప్రయత్నిస్తానా. దేవుడున్నాడు. ప్రతి యుగానికీ దేవుడున్నాడు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు. మృగదశలో వుండి, మాంసాహారులై, చెట్టు గుట్టల చుట్టూ దిమ్మతిరిగిన మన పూర్వులకు దేవుడున్నాడు. సైన్సు వృద్ధి పొందింది. దాని ధాటి కాగలేక దేవుడు శలవు తీసుకుంటున్నాడూ, నిష్క్రమిస్తున్నాడూ, అని విర్రవీగే మనకు దేవుడున్నాడు. కాని బేధమెక్కడంటే మన దేవుడు మన పూర్వుల దేవుడుకాదు; కాలంతోపాటు ఉద్దేశాలు మారుతూ వచ్చాయి. ఉద్దేశాలతోపాటు దేవుడూ మారుతూ వొచ్చాడు కనక. ఇక్కడ నేను దేవుడేవిధంగా జనన మొందాడో, బాల్య కౌమారం దశలు ఏ విధంగా గడిపాడో, యిప్పుడే విధంగా వుండి, 'ఎల్లకాలం 'కృష్ణా, రామా' అనుకుంటూ గడుపుతున్నాడో వర్ణిస్తాను.......................

  • Title :Pathithulu Marikonni Kathalu
  • Author :Gopi Chand
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN6371
  • Binding :Papar Back
  • Published Date :May, 2025
  • Number Of Pages :179
  • Language :Telugu
  • Availability :instock