• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pattu Thova

Pattu Thova By Vasudhendra

₹ 475

అడవిలో బతికేవారికి కళ్ళకన్నా చెవులు చాలా చురుకుగా ఉండాలి. దట్టమైన చెట్లు కమ్ముకున్న అడవిలో ప్రాణులకు పక్షులకు దాక్కొనే తావులు వేలాది. అందువల్ల కేవలం కళ్ళను ఉపయోగించి అడవుల్లో జీవించడం కష్టం. చెవులు అప్రమత్తమైనట్టల్లా చుట్టూ జరుగుతున్న వాస్తవాలన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. మనుష్యుల కళ్ళు పనిచేయటం వెలుతురు కాంతిలో మాత్రమే. అయితే చెవులు వెలుతురులోనూ చీకట్లోనూ అప్రమత్తంగా ఉంటాయి. అందువల్లనే అడవిలో బ్రతుకు సాగించేవారికి ఒళ్ళంతా చెవులుంటాయి.

"కుదుర్... కుడర్... కుడుర్... కూ.... కూ...కీ..." అనే ఆ పక్షి అనన్యమైన కూతకు హవినేమకు మెలకువ వచ్చింది. ఎర్రటి తోక, ఎర్రటి శిఖ, ఒంటి మీద నీలం - ఎరుపు చుక్కల ఆ పక్షి అడివిలోని ఈ భాగంలో మాత్రమే చూడగలం. సరిగ్గా వెలుతురు పరుచుకోవడానికి కొంచెం ముందు కూయటం దానికి అలవాటు. అది తనను లేపటానికి కూస్తుందేమో అనే అనుమానం హవినేమకు ఉంది. ఎందుకంటే సరిగ్గా అతని గుడారం దగ్గరికే వచ్చి ఆ పక్షి కూసింది. మొదటి కూతకే అతనికి మెలకువ వచ్చినప్పటికీ, కావాలనే ఆలస్యం చేసి, అలాగే కొద్దిసేపు మెలకువలోనే కళ్ళు మూసుకున్నాడు. ఆ పక్షికి తొందరపడే స్వభావం లేదు. అందువల్ల కొద్దిసేపు కూయకుండా మౌనంగా ఉంది. ఇతను అది మరొకసారి కూయనీ అని చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ అరుదైన పక్షి. మళ్ళీ కూయనే లేదు. కావాలనుకున్నప్పుడు కోపగించుకునే, వద్దన్నప్పుడు కురిసే వాసరాయుడిలా ఉంది దాని ప్రవర్తన. ఇంకేమి ఇతని చెవులు చురుకుదనం....................

  • Title :Pattu Thova
  • Author :Vasudhendra
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5994
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :438
  • Language :Telugu
  • Availability :instock