అంత నాది అనుకుంటే బంధం. అంత భగవంతునిది అనుకుంటే ముక్తి.
అనుకూల పరిస్థితులు తోడైనపుడే స్వీయ ప్రతిభ రాణిస్తుంది.
అడుసు తొక్కనేల కాలు కడగనేల.
అమ్మ, ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పొగొట్టుకొన్నప్పుడే ఆమెలేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
అమ్మకు కోపమొస్తే తిడుతుంది. తప్పుచేస్తే కొడుతుంది. ముద్దోస్తే అక్కున చేర్చుకొంటుంది. వీటన్నింటికి ప్రేరణ అమ్మప్రేమ. 7. అసాధ్యమే అయినా ఆచరిస్తే అత్యుత్తమమైనవి అందుతాయి.
8. అసాధ్యం అనేపదం అసమర్దుని నిఘంటువులో వుటుంది. అంతరాత్మ ముందుగా మిమ్మల్ని ఓ స్నేహితుడిగా హెచ్చరిస్తుంది. దాన్ని మీరు వినకుంటే ఓ బిడ్డలా శిక్షిస్తుంది.
విద్యాప్రకాశానందగిరి స్వామి
అవసరం పిరికి వాణ్ణి కూడా ధైర్యవంతుణ్ణి చేస్తుంది - శాల్లుస్ట్