శ్రీకారం
మేము రాజమండ్రిలో వున్నపుడు మా కాకినాడ తాతగారు, బామ్మగారు మా ఇంట్లో కొన్నాళ్ళున్నారు. తాతగారు కంటిశుక్లాలు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆరోజుల్లో ఆ ప్రక్రియ మూడు నెలలు పట్టేది. మా బామ్మగారు ఇవటూరివారి అడపడుచు. వాళ్ళనాన్నగారు పదివూళ్ళకి జమీందారు. ఆవిడ మధ్యాహ్నం భోజనాలయ్యాక చేతిలో కాస్త వత్తులపత్తి పట్టుకుని మెట్ల మీద కూచుని అటు ఇటు తిరుగున్న నన్ను పిలిచి 'ఒసే అమ్మా! ఇలా కూచోవే! అక్కడ పేపరు తిరగేస్తున్నారు చూడు తాత ఆయనకి... నన్నడగడానికి మీ పెద్ద తాతగారు బాండు మేళంతో వచ్చారు తెలుసా! నన్ను చూపించమంటే మా నాన్నగారు “అలా కుదరదండీ! అమ్మాయి బళ్ళో చదువుకుంటోందీ" అని చెప్పారు. సరే లెమ్మని అందరూ మాట్లాడకుండా..........