పెరియార్ జీవిత విశేషాలు
1879 సెప్టెంబర్ 17వ తేదీ జన్మించాడు. తల్లి చిన్నతాయమ్మాళ్ అనిపిలవబడే ముత్తమ్మాళ్, తండ్రి వెంకట నాయకర్, అన్న - ఇ.వి.కృష్ణ సామీ, చెల్లి- కణ్ణమ్మాళ్,
1885లో ఆరేళ్ళ వయసులో ఒక ఇంట్లో నడిపే పాఠశాలకు పంపబడ్డాడు. 1889లో పదేళ్ల వయసులో స్కూల్ కి స్వస్తి పలికాడు.
1891 అంటే 12 ఏళ్ళకి తండ్రి వ్యాపారంలో సహాయం చేయడం మొదలు పెట్టాడు .
1895లో తమిళ వైష్ణవులు, మతగురువులు తన ఇంట్లో చెప్పే పురాణాలను విని ఆనందించాడు. వాటిలో తనకున్న అనుమానాలను అపురాణాలు చెప్పడానికి వచ్చిన వారిని ప్రశ్నించేవాడు. బ్రాహ్మణులూ ద్రావిడులు బానిసలుగా చూడడాన్ని ప్రశ్నించేవాడు. అప్పుడే రామస్వామిలో హేతువాద బీజాలు పడ్డాయి.
1898లో నాగమ్మాళ్ తో వివాహం జరిగింది పరమ ఛాందసురాలైన ఆమెలో హేతువాద బీజాలు నాటాడు పెరియార్.
1900లో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చాడు. కానీ ఆ పాప 5 నెలల కన్నా బతక లేదు. ఆ తర్వాత అతనికి పిల్లలు కలగలేదు.
1904లో తండ్రి దూషించడంతో కోపంతో కుటుంబం నుండి 'సన్యాసం' స్వీకరించాడు. మొదట విజయవాడ, తర్వాత హైదరాబాద్ ఆ తర్వాత కలకత్తా వెళ్ళాడు.
ఇల్లు వదిలి వెళ్ళి కాశీ చేరుకున్నాడు కాశీలో జరిగిన అవమానం అతనిలో హేతువాదాన్ని ప్రేరేపించింది. చేతిలో డబ్బులు లేవు. తిండికి అలమటించవలసి | వచ్చింది. చాలా రోజులు ఆకలితో పస్తులు ఉండవలసి వచ్చింది. ఒకరోజు ఆకలికి | తాళలేక బ్రహ్మణుడిలాగా ద్యంజం వేసుకుని ఒక సత్రానికి వెళ్ళాడు. కానీ అతనికున్న మనం వలన అక్కడి కాపలావాడు రామస్వామిని లోపలి అనుమతించలేదు. ఆ • సత్రంలో మిగిలిన అన్నాన్ని వీధిలో పారేయడం చూశాడు. ఆకలికి తాళలేక రామస్వామి పారేసిన అన్నాన్ని కుక్కలతో పంచుకుని తిన్నాడు. అన్నం తింటున్నప్పుడు.........