• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Periyar

Periyar By Dr K Satyanarayana

₹ 120

ఒకటవ ఘట్టం

బాల్యం

నేను నా వద్దకు వచ్చిన పల్లెటూరు వస్తువులు కొనేవాడితోనూ మరియు నాతోటి వర్తకునితోనూ మాట్లాడాను. ఇంకా నేను పవిత్రమైన భక్తులతోనూ మరియు పురోహితుని తోనూ మాట్లాడాను. వీళ్ళందరితో మాట్లాడిన తరువాత అవి నన్ను దేవునిపై నమ్మకం లేనివానిగానూ, పురాణాలు, శాస్త్రాలను వ్యతిరేకిగానూ మరియు నాస్తిక సిద్ధాంతాలను నమ్మేవానిగా మార్చివేశాయి. అవే నాలో కులం, మతం, దేవుడు అనే విషయాలపై పునాదులు వేశాయి.

పెరియార్, బాల్యం రోజులు (xx:P5)

ఆ పిల్లవాణ్ణి ఓ పెద్ద దూలానికి గొలుసులతో కట్టివేశారు. అయినా అల్లరి చేసేవాడు, తన తోటి తరగతి పిల్లవాళ్ళను కొట్టేసేవాడు. ప్రతీసారి వచ్చి ఉపాధ్యాయులు అతని తండ్రితో మొరపెట్టుకొనేవారు. ఆ ఫిర్యాదులు విని విని విసుగు చెంది, చివరకు తండ్రి దిక్కుతోచని స్థితిలో ఓ దూలానికి ఆ పిల్లవాణ్ణి గొలుసులతో కట్టివేశాడు.

ఇంటి వద్దనే  వున్న పెద్ద దూలానికి గొలుసులతో బంధించివేశాడు ఇక ఎక్కడికి పోగలడులే అన్న ఆలోచనతో. తనతండ్రి వెనక్కి తిరిగాడో లేదో దూలం భుజంపై వేసుకొని తన స్నేహితులను, తన తోటిపిల్లలను కలవడానికి ఒక్క ఉదుటన పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఈ అల్లరిపని, బలమైన పని ఈ పిల్లగాని జీవితంలో కీడును శంకించేటట్లు చేశాయి.

ప్రతీసారి తన విరోధులు, శత్రువులు ఇతన్ని అన్ని విధాలా ఇరికించి వేసాము ఇక తిరిగి రాడు, హమ్మయ్య అని సంతోషించేలోపునే ఇంతకు పూర్వంకంటే రెట్టింపు వేగంతో గోడకు కొట్టిన బంతిలా వేగంగా వెనక్కి తిరిగి వచ్చేవాడు. ఆ పిల్లవాని పేరే రామస్వామి. ఆ తరువాత కాలంలో ఓ గొప్ప పెద్దగా పిలిచేవారు............

  • Title :Periyar
  • Author :Dr K Satyanarayana
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN5029
  • Binding :Papar back
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :132
  • Language :Telugu
  • Availability :instock