• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Periyar ( E V Ramaswamy Rajakeeya Jeevita Charitra)

Periyar ( E V Ramaswamy Rajakeeya Jeevita Charitra) By K Satya Ranjan

₹ 150

 బాల్యం

నేను నా తుక్కు ఖాతాదారులతో, సాటి వ్యాపారస్థులతో మాట్లాడాను. అలాగే పవిత్ర భక్తులతో, పూజారులతో చర్చించాను. ఈ సంభాషణలు, చర్చలే నాలో మత వ్యతిరేక, శాస్త్ర వ్యతిరేక, పురాణ వ్యతిరేక నాస్తిక భావజాలాన్ని ప్రోది చేసాయి. కులం, దేవుడు, మతం - ఈ మూడింటి మీదా నాకు ఒక దృక్పథం ఏర్పడడానికి పునాదిగా నిలిచాయి. అలాగే ఎందుకో బ్రాహ్మణవాదం పట్ల నాలో విముఖత పెరిగింది.

- పెరియార్, తన బాల్యం గురించి (XX : పేజి 5)

ఆ పిల్లవాడికి సంకెళ్ళు వేసి వాటిని ఒక దుంగకి బిగించారు. క్లాసులో తోటి పిల్లల్ని కొడుతున్నాడట ఆ పిల్లాడు. పంతులు గారు చెప్పే ఫిర్యాదులు వినీ వినీ అలసిపోయిన ఆ పిల్లాడి తండ్రి పిల్లాడిని అలా మోయలేని బరువున్న దుంగకి కట్టేసి ఇంటి పట్టున ఉండేలా చేసాడు. వాళ్ళ నాన్న అటుకేసి తిరగడం ఆలస్యం పిల్లాడు ఆ దుంగను భుజాన వేసుకుని సంకెళ్ళతోనే తన స్నేహితులను కలవడానికి పారిపోయాడు.

ఈ దుంగ ఉదంతం ఆ పిల్లవాడి తదనంతర జీవితానికి ఒక సూచన వంటిది. అతని ప్రత్యర్థులు ఇక వీడి పని అయిపోయింది. మట్టి కరిపించేసాం అని సంబరపడిన ప్రతిసారీ అతను మరింత శక్తివంతంగా తిరిగి రంగం మీదకి వచ్చి నిలబడ్డాడు. ఆ పిల్లవాడి పేరే రామస్వామి. కొన్నేళ్ళ తరువాత పెరియార్ (పెద్దాయన)గా పేరొందాడు.

కుటుంబం

1879 సెప్టెంబర్ 17న పెరియార్ ఈరోడ్లో జన్మించాడు. ఆయన కుటుంబం కన్నడ బలిజ నాయుడు కులస్థులు. ఈరోడ్ వచ్చి స్థిరపడింది. పెరియార్ తండ్రి వెంకటర్ నాయకర్. సంపన్న వర్తకుడు. క్వారీలో కూలీగా పనిచేసి స్వయంకృషితో ఎదిగి వచ్చాడు....................

  • Title :Periyar ( E V Ramaswamy Rajakeeya Jeevita Charitra)
  • Author :K Satya Ranjan
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN6464
  • Binding :Papar back
  • Published Date :2025
  • Number Of Pages :98
  • Language :Telugu
  • Availability :instock