పెరియార్ జీవిత సంగ్రహం
1879 సెప్టెంబర్ 17 : - చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా 'ఈ రోడ్'లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.
1885 (ఆరేళ్ళ వయసు) : - ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
1889 పదేళ్ళ వయస్సు : - ప్రాథమిక విద్య పూర్తయింది.
1891 (12 ఏళ్ళు) : - అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.
1895 ; - తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
1898 ; - అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
1900 : - అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
1904 : - తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను
విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.
చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి "యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ...........