• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pettubadi Mi Jeevana Vidhanam

Pettubadi Mi Jeevana Vidhanam By Vedantam Venkata Satyavati

₹ 399

ముందుమాట రెయాన్ లెవెస్క్

మార్చి 23, 2019 నాడు జరిగిన సంభాషణ నా జీవితాన్ని ఆద్యంతము మార్చివేసింది.

ఆ సంభాషణ జస్టిన్ డోనాల్డ్ అనే వ్యక్తితో నడచింది. నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకునే నాలుగు మాటలు ఆ రోజు భోజన సమయంలో రహస్యంగా పలికాడు. అంతే! అంతా మారిపోయింది. ఆ నాలుగు సాధారణ మాటలు నేను ఊహించలేని మార్గాల వెంబడి నేను పయనమయ్యేలా చేసాయి. అది కూడా నేను కలలో కూడా సాధ్యపడుతుందని అనుకోని కాలపరిమితి లోపలే!

మీరు కనుక సావధానంగా ఈ పుస్తకంలో చదివినది అనుసరిస్తే, మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. అదెలాగో నేను వివరిస్తాను.

మొదటగా, మీరు ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుతున్నట్లయితే, మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, నిష్క్రియ ఆదాయాన్ని పెంచుకుని, తద్వారా సాధించాలని, నెలసరి ఆదాయాన్ని పెంచుకుని జీవనశైలి ఖర్చులని ఎదుర్కోవాలని కల గంటారు. మరొక మాట చెప్పాలంటే కష్టించకుండా వుండే స్థాయిని పొందాలనుకుంటారు. లేదా మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ వుంటారు. లేదా సొంత వ్యాపారం చేసుకుంటూ తగిన ఆదాయాన్ని పొందుతూ వుండి వుంటారు. కాని అది మీ కాలాన్ని మింగేస్తుంది. బహుశ చాలా ఎక్కువ కాలమే కావచ్చు.

జస్టినిని మొదటిసారి కలిసేటప్పటికి ఇందులోని రెండవ సన్నివేశంలో వున్నాను నేను. ఆ రోజు శనివారం, మార్చి 23, 2019. నేను క్రొత్తగా ప్రవేశించిన బృందం 'ఫ్రంట్ రో డాడ్స్' వారు నిర్వహించిన సమావేశం ఆస్టిన్లోను, టెక్సాస్లోను జరుగుతుండగా హాజరయ్యాను అది మంచి........................

  • Title :Pettubadi Mi Jeevana Vidhanam
  • Author :Vedantam Venkata Satyavati
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN6376
  • Binding :HARD BAINDING
  • Published Date :2025
  • Number Of Pages :230
  • Language :Telugu
  • Availability :instock