₹ 75
మర్క్స్ పెట్టుబడి గ్రంధం రెండవ సంపుటానికి జాన్ ఫాక్స్ క్లుప్తమైన పరిచయం ఇది. పెట్టుబడి గ్రంధం మొత్తం మూడు సంపుటాలు అయినప్పటికీ, ఈ రెండవ సంపుటానికి అంతగా ప్రాధాన్యత లభించలేదు. దానికి కారణం లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానంలో కార్మికులను పెట్టుబడిదారులు ఎలా దోచుకుంటారు అనే విషయాన్ని ప్రధానంగా మొదటి సంపుటంలో మర్క్స్ వివరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఇద్దరికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే సూత్రం మాటున ఈ దోపిడీ ఎలా మరుగున పడుతుందో దాని మర్మాన్ని మొట్టమొదటిగా మర్క్స్ బట్టబయలు చేసాడు. కార్మికుని నుండి పెట్టుబడిదారుడు కొనుగోలు చేసెది శ్రమ కాదని, శ్రమ శక్తి అని మర్క్స్ తొలిసారి చెప్పడంతో పెట్టుబడిదారీ దోపిడీ బండారం బయటపడింది. పెట్టుబడిదారుడు కొనుగోలు చేసిన శ్రమ శక్తిని వినియోగంలో పెట్టుకునే హక్కు సంపాదిస్తాడు.
-జాన్ ఫాక్స్.
-గుడిపూడి విజయరావు.
- Title :" Pettubadi" Rendava Samputam Ardham Chesukovatam Ela
- Author :John Phaks , Gudipudi Vijaya Rao
- Publisher :NavaTelangana Publishing House
- ISBN :MANIMN0556
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock