కాకులు
చెవి దగ్గర దోమ "పాడుతోంది"! నేను ఎడంచేత్తో దాన్ని తోలేశాను. అది మరలా నా చెవిదగ్గరికొచ్చి పాడసాగింది. నా నిద్ర ఎగిరిపోయింది. మెల్లగా మెలకువ వచ్చింది. నిశ్శబ్దం. అవును. అంతా నిశ్శబ్దంగా వుంది. సీలింగ్ కేసి చూశాను. ఫ్యాను కూడా ఆగిపోయింది. కరెంటు ఎప్పుడు పోయిందో మరి. ఫ్యాను తిరగకపోవడం వలన గాలి ఆడడం లేదు. ఉక్కపోస్తోంది. ఒళ్ళంతా చెమట కూడా పట్టేసింది.
ఈ సారి దోమ నా కుడిచెవిలో పాడటం మొదలు పెట్టింది. దాన్ని తోలుదామని చెయ్యి ఎత్తబోయాను. సావిత్రికి మెలుకువ వస్తుందనిచెప్పి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఆమె తన చేతిని నా ఛాతీ మీద పెట్టి పడుకొని వుంది. నా చేతిని కదపడానిని వీలులేదిక.,,,,,,,,,,,,,,,