• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pillana Grovi

Pillana Grovi By Vijaya Goli

₹ 200

మ్రోగించిన 'పిల్లన గ్రోవి' గజళ్ళు

గజల్ అనే మాటకు ప్రేయసీ ప్రియుల సంభాషణమనే అర్థం ఉన్నది. సంభాషణ మనగా సల్లాపం. సల్లాపములేవి యైననూ మధుర సల్లాపములుగానే యుండతగును. కానీ, ఉర్దూ గజల్ వియోగ ప్రేమకు ఆలవాలమై తరచూ విలాప సల్లాపములుగానే కొనసాగినది. ప్రేయసి అల్ప. ప్రియుడు వియోగ తప్త హృదయుడు. వస్తువేదియైననూ అలబ్దమైన దాని ఎడల మనిషికి అనురాగము అధికము....ఉర్దూ గజల్ కవులు ఎక్కువగా అల్ప ప్రేయసి పట్ల తమకు గల ఆరాధననూ, హృదయాంతరాలలో పొంగిపొర్ల దుఃఖం తాలూకు అభివ్యక్తులనూ గజళ్ళుగా రూపొందించుకున్నారు.

రసాలలో కరుణ రసం శ్రేష్టమైనది. అట్టి కరుణ రస భావప్రవాహములే వారికి గజళ్ళైనవి. ఇది ఒక కోణము కాగా మరొక కోణమున్నది. అది సూఫీతత్వము. " భగవంతుడినే ప్రియుడిగా తలంచి వియోగ ప్రేమ నేపథ్యముగా భగవంతుని | తమకుగల అచంచలమైన భక్తిని కవిత్వంగా రాయుట రెండవ కోణము. ఇలాంటి | అలౌకిక గజళ్ళను "ఇష్-ఎ-హకీకి” గజళ్ళంటారు. లౌకిక పరమైన ప్రేమ తాలూక ! గజళ్ళను "ఇష్-ఎ- మజాజి” గజళ్ళంటారు. -

"ఇష్- ఎ-హకీ” గజళ్ళు సూఫీతత్వ విలసితాలు. మీరా భజనలు ఇలాం! | కోవకు వర్తిస్తాయి. తెలుగులో ఇలాంటి భక్తిని “మధుర భక్తి" అంటారు. ఇప్పు |

మనం చేతిలో ఉన్నది "పిల్లన గ్రోవి"గజల్ సంపుటి. ఈ సంపుటి రచయిత్రి మహా గోలి' గారు. మనకు రాధాకృష్ణులు తెలుసు. 'రాధ' కూడా మధుర భక్తియి. |

  • Title :Pillana Grovi
  • Author :Vijaya Goli
  • Publisher :Vijaya Goli
  • ISBN :MANIMN3473
  • Binding :Paerback
  • Published Date :June, 2022
  • Number Of Pages :138
  • Language :Telugu
  • Availability :instock