• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pineapple Jam

Pineapple Jam By Vijay Koganti

₹ 150

ఒక చిన్న మాట!

పైనాపిల్ జామ్ - మన ముందున్న ఈ చిన్న పుస్తకం దాదాపు ముప్పై కథల్ని చెపుతోంది. వ్యంగ్యం, హాస్యం, సాహసం, విషాదం, ఎదిరింపు లాంటి మానవ సహజ లక్షణాల్ని ఈ కథలు చెపుతాయి. అన్నీ చిన్న కథలు కావడం వీటి ప్రత్యేకత. చిన్న కథ చినుకులాగా కళ్ళలో పడి వర్షం లాగా మనసులో కురుస్తుంది.

'పైనాపిల్ జామ్' అనే కథ చదివాక ఆ చక్కటి భావన కాసేపు మన్ని పట్టుకుంటుంది. 'జొమాన్స్' కథ కొత్త ప్రేమ కథ. జొమాటోనీ రొమాన్స్నీ కలిపి జొమాన్స్ అన్నాడు కథకుడు. చదువూ కాస్త సంపాదన, వయసు తీసుకొచ్చిన అల్లరి అన్నీ కలుస్తాయి. కానీ దీన్ని కొనసాగించాలా వద్దా ...? ఎస్ ఆర్ నో .. నో ఆర్ ఎస్ ... ఈ ముగింపు తరువాత ఆ పిల్లలు మన కళ్ళముందు కనిపిస్తారు నవ్వుతూ .....

మరో కథ ‘పెద్దరికం’ కొద్దిగా పాతకాలపు కథలా అనిపించే హాయైన ప్రేమ కథ. ప్రకాష్, పద్మల కనపడని ప్రేమకి వాళ్ళకి సంబంధమే లేని విషయాలు కారణం. అక్క ప్రసూన 'ఈ విషయం నాన్న కదిలిస్తేనే మంచిది' అని సరిగ్గానే గుర్తించింది. పెద్దరికం చాలా అసాధ్యం అనుకున్న సమస్యలని అలవోకగా పరిష్కరిస్తుంది.

'పాపం పరాంకుశం', ఇవాళ టీవీల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన ఒక సైకో వాతావరణానికి వ్యంగ్యం కలిపి రువ్విన బాణం. ఇందులో హాస్యం వుంది. అది గిరీశం చెప్పినట్టు లోపల్లోపల తహ తహ పుట్టిస్తుంది. ఆ ... మరీ అలా వుంటారా అని అనుకుంటారు అందరూ ... కానీ అంతకన్నా ఎక్కువగానే వున్నారని లోపల తెలుస్తూనే వుంటుంది.

‘చీమలు ఈగలు' కథ పాత కాలపు తండ్రీ కొడుకుల ఆస్తి సంబంధమే అయినా తండ్రి 'ఆస్తుల వాటాల కోసం రావద్దు - ప్రేమని పంచడానికే రండి' అని చేసిన ఎదిరింపు పోయెటిక్ జస్టిస్ కావచ్చు కానీ కావల్సింది అదే కదా .......................

  • Title :Pineapple Jam
  • Author :Vijay Koganti
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5048
  • Binding :Papar back
  • Published Date :May, 2023
  • Number Of Pages :67
  • Language :Telugu
  • Availability :instock