జననం, బాల్యం, విద్యాభ్యాసం
పింగళి వెంకయ్యగారిది గౌతమస గోత్రం (పింగళి ఇంటిపేరుతో భరద్వాజ గోత్రీకులు కూడా ఉన్నారు). వీరి పూర్వీకులు కొన్ని శతాబ్దాల క్రితం మహారాష్ట్ర నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారని, వీరు పింగళి మోరోపంత్, ఝూన్సీ లక్ష్మీబాయిల వంశానికి చెందిన వారని, అంతేకాక గోల్కొండ నవాబు వద్ద సేనానిగా ఉన్న పింగళి మాదన్న కూడా వీరి వంశీకులేనని, వెంకయ్యగారు చేసిన తమ వంశ వృక్షమూలాల పరిశోధనలో తేలినదని వారి పెద్ద కుమారుడు. పరశురామయ్య చెప్పేవారు.
పింగళి వెంకయ్యగారు 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లా దివి తాలూకా పెద్దకళ్ళేపల్లి గ్రామములో మాతామహుల ఇంట జన్మించారు. (తమ తండ్రి వెంకయ్యగారు పుట్టినది పెదకళ్ళేపల్లి అని వెంకయ్య గారే స్వయంగా తనతో చెప్పినట్లు ఆయన కుమార్తె సీతామహలక్ష్మి చెప్పారు. ఆయన తాతగారు అడవి వెంకటాచలపతి. చల్లపల్లి సంస్థానంలో ఠాణేదారు. అమ్మమ్మ పేరు సీతమ్మ. వెంకయ్య గారి తండ్రి పింగళి హనుమంతరాయుడు. తల్లి వెంకటరత్నం వీరిది. ఆచారవ్యవహారాలను, సాంప్రదాయాలను, కట్టు బాట్లను పాటించే నియోగి బ్రాహ్మణ కుటుంబం.
హనుమంతరాయుడు గారి తల్లిదండ్రులు అచ్చమ్మ, వెంకన్న గార్లు. హనుమంతరాయుడు గారు కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామ కరణం. యార్లగడ్డ గ్రామం చల్లపల్లికి రెండు మైళ్ళ...................