చరిత్ర
వివిధ పేర్లు నేటి పిఠాపురానికి అనేక కాలాలలో, అనేకుల పాలనలో వివిధ పేర్లు వున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పిట్టపురం, పిష్టపురము, పిఠాపురము, పిఠాపట్టణము, శ్రీపీఠము, పీఠికాపురము, పురుహూతికాపురము, పిట్టపోర్, పింగ్-కి-లో చైనా యాత్రికుడు తెల్పినది) పిటిండ్రా, పిథుండా (అలెగ్జాండ్రియా యాత్రికుడు టాలెమి తెల్పినది), పిహరడా (వర్ధమాన మహావీరుని కాలానికి చెందింది. __టాలెమీ పిథుండా పట్టణమని పిఠాపురాన్ని పేర్కొన్నాడు. రేవు వున్న ప్రాంతాన్ని పట్టణమని పిలుస్తుంటారు. దాన్ని బట్టి పిఠాపురం ఒకప్పుడు రేవు పట్టణమై వుండవచ్చు.
బహుశా ఉప్పాడ వరకూ పిఠాపురం ఉండి వుండవచ్చు.
శాసనాలలో పిఠాపురం : భారతదేశ చరిత్రలో పిఠాపురం అనేక సందర్భాలలో ప్రస్తావించబడుతుంది. ప్రసిద్ధి చెందిన రాజ్యాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని పొందినట్లు తెలుస్తుంది. గోదావరి నదికి ఉత్తరం వైపునున్న ప్రాంతమంతా కళింగ రాజ్యంలో భాగంగా వుండేది. గంగానది నుండి కటకం వరకూ వున్న ప్రాంతాన్ని ఉత్తర కళింగమనీ, కటకం నుండి మహేంద్రపర్వతం వరకూ వున్న ప్రాంతాన్ని మధ్య కళింగమనీ, మహేంద్ర పర్వతం నుండి పిఠాపురం వరకూ వున్న ప్రాంతాన్ని దక్షిణ కళింగమనీ పిలుస్తుంటారని వ్యాసుడు మార్కండేయ పురాణంలో రాశారు.
సుదీర్ఘకాలం పాటు పిఠాపురం కళింగ రాజ్యంలో భాగంగా వుంది. వేంగీ రాయలసీమ ప్రాంతాలతో సంబంధం లేకుండానే వుంది. ఇప్పటివరకూ లభించిన శాసనాల ప్రకారం పిఠాపురం కళింగానికి చెందిన ముఖ్య పట్టణాల్లో ప్రధానమైనది గాను, కొన్ని సందర్భాల్లో రాజధానిగానూ వున్నట్లు తెలుస్తుంది.
సాహు రాసిన History of Orissa (ఒరిస్సా చరిత్ర)లో క్రీ.పూ. 4వ శతాబ్దానికి ముందుగానే నేటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతం కళింగ రాజ్యంలో భాగంగా వుండేదని పేర్కొన్నారు. క్రీ.పూ. 4వ శతాబ్దిలో బీహారుకు చెందిన నంద రాజ్యాన్ని స్థాపించిన మహాపద్మానంద (క్రీ.పూ.424-క్రీ.పూ. 321) కళింగాన్ని గెలిచి, తన రాజ్యమైన మగధ (నేటి బీహార్) నుండి గోదావరీ పరివాహక ప్రాంతం...............