రెండవ ముద్రణకు ముందుమాట
పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అనే గ్రంథం 2003లో ముద్రణ అయ్యింది. 2023కి గానీ రెండవ ముద్రణ తీసుకురాలేక పోయాం. నిజానికి ఈగ్రంథం ముద్రణ అయిన 3 సంవత్సరాలకి కాపీలు చెల్లుబడి అయినాయి. కానీ కొత్త పుస్తకాల ముద్రణ పనిలో జాప్యమయ్యింది. నిజానికి ఈ గ్రంథం సంచలనం సృష్టించింది. ఈ గ్రంథం దళిత మేధావి డా॥ కె. రాజరత్నం గారు కల్పించిన అవకాశం వల్ల గురుకుల్ లూథరన్ థియోలాజికల్ కాలేజి అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెన్నైలో రిసెర్చ్ ఫెలోగా ఉమెన్స్ డిపార్ట్మెంట్ సంచాలకులు శ్రీమతి ప్రసన్న కుమారి గారి గైడెన్స్లో జరిగిన పరిశోధన. 1995 నుండి 2002 వరకు ఒక వెయ్యి పేజీలు వ్రాశాను. డాక్టర్ రాజరత్నం గారు గొప్ప మేథావి, ఆలోచనాపరుడు, పండితుడు, అడ్మినిస్ట్రేటర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ & విశ్వ విద్యాలయంలో 15 సంవత్సరాలు ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆయన.............