• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pocso Cattamu 2012

Pocso Cattamu 2012 By M V Sastri

₹ 90

లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012
(2012 లోని 32 వ చట్టం)

(జూన్ 19, 2012)
ఉద్దేశ్యాలు - కారణాల వివరణ
(STATEMENT OF OBJECTS AND REASONS)
ఇతర విషయాలతో పాటు భారత రాజ్యాంగంలోని 15వ నిబంధన,

పిల్లల కొరకు ప్రత్యేక సదుపాయం కలిగించేందుకుగాను రాజ్యానికి అధికారాలు ప్రసాదించింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 39వ నిబంధన ప్రకారం, లేతవయసులోని పిల్లలు దురాచారానికి గురికాకుండా, వారి బాల్యం మరియు యౌవనం దోపిడీ నుండి రక్షింపబడి, స్వేచ్ఛ గౌరవం గల పరిస్థితులలోను, ఆరోగ్యకరమైన పద్ధతిలోను అభివృద్ధి చెందటానికి, భద్రత కల్గించే దిశగా రాజ్యం విధానం రూపొందించుకోవాలి.

  1. ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కులపై (Rights of Children) ది. 11 డిసెంబరు, 1992 నాడు నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్న రాజ్యాలపై బాధ్యత వహింప చేస్తూ కొన్ని చర్యలకు పూనుకొనవలసిందిగా కోరింది. ఇందుకు భారతదేశము కూడా తన సమ్మతిని తెలియచేసింది. జాతీయంగాను, ద్వైపాక్షికంగాను, 'బహుముఖీనంగాను చర్యలు తీసుకుని - (ఎ) ప్రలోభంతో లేక బలవంతం గాను పిల్లలను చట్ట విరుద్ధ లైంగిక కార్యకలాపాలలో పాల్గొనేటట్లు చేయటం (బి) పిల్లలను వ్యభిచారంలోకి లేదా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలలోకి దోపిడీ విధానం ద్వారా ఉపయోగించటం మరియు (సి) దోపిడీ విధానంతో పిల్లలను అశ్లీల శృంగార (Pornographic) ప్రదర్శనలు మరియు వస్తువులుగ ఉపయో గించడం - వంటి నేరాల నివారణకు, తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

 

  1. పిల్లలపై లైంగిక నేరాల కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నదని జాతీయ నేర సమాచార విభాగం (National Crime Records Bureau) వారు సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తుంది. స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ' జరిపిన పిల్లలపై దౌర్జన్యం - భారతదేశం-2007 - ఒక అధ్యయనం' కూడా పై విషయాన్ని బలపరుస్తుంది. అంతేకాకుండా, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై...............

  • Title :Pocso Cattamu 2012
  • Author :M V Sastri
  • Publisher :Supreme Law House
  • ISBN :MANIMN3694
  • Binding :Papar back
  • Published Date :Oct, 2022
  • Number Of Pages :40
  • Language :Telugu
  • Availability :instock