₹ 150
పొద్దు తిరుగుడు మనిషి ప్రొ. జి. ఎన్. సాయి బాబా విడుదలను ఆకాంక్షిస్తూ ఎంతోమంది కవులు, రచయితలు రాసిన కవిత్వాలతో, రచనలతో కూడిన 176 పేజీల పుస్తకం ఇది. వరంగల్ రచయితల సంఘం పక్షాన నల్లెల్ల రాజయ్య సంపాదకులుగా వెలువడుతున్నది.
ప్రొ. జి. ఎన్. సాయి బాబా కోసం సాహిత్యం, వ్యాసాలు అని పేర్కొన్నప్పటికీ ఈ రచనలన్నింటిలోనూ ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆయన సహచరులు హెమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీ, పాండు రావత్, మహేష్ టిర్కి, విజయ్ టిర్కి (పదేళ్ల శిక్ష) ల విడుదల ఆకాంక్ష కూడా వీటిలో ఉంది. అంతమాత్రమే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ ఖైదీల అందరి విడుదల ఆకాంక్ష కూడా ఇందులో ఉంది. ఈ రాజకీయ ఖైదీలందరూ ఈ దేశంలో పీడితుల గురించి, పోరాట ప్రజల గురించి, ఆదివాసులు, దళితులు, ముస్లిం మైనార్టీలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, స్త్రీలు మొదలైన వివక్షకు గురవుతున్నవాళ్ల గురించి మాట్లాడుతున్నవాళ్లు, రాస్తున్నవాళ్లు, పోరాడుతున్నవాళ్లు, నిరంతరం వాళ్ల గురించి ఆలోచిస్తున్నవాళ్లు, స్పందిస్తున్నవాళ్లు.
- ప్రొ. జి. ఎన్. సాయిబాబా
- Title :Poddu Tirugudu Manishi
- Author :Prof G N Sai Baba
- Publisher :Divyangula Joint Action Committee
- ISBN :MANIMN0508
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock