సుస్వాగతం
మధ్య నాకు రాత్రిళ్ళు నిద్రపట్టడంలేదయ్యా”
ఈ అన్నాడు కుక్కుటేశ్వరరావు.
“అవును మరి! లక్షలుపోసి ఇల్లు కట్టించావు కదా! అంతో ఇంతో అప్పు చేసుంటావు. అది తీరేదాకా నిద్ర రాదుమరి" అన్నాను నేను. "అబ్బెబ్బె! నా సంగతి తెలిసికూడా అంత చీప్ గా మాట్లాడతావేమిటి? అప్పుచేసే మనిషినా నేను. ఇన్నేళ్ళుగా పొదుపుచేసి... నానా అవస్థలు పడి.... గడ్డితిని మరీ కట్టించాను
తెలుసా?"
"అలాగా! అయితే నిద్ర రాకపోవడానికి ఏదైనా అనారోగ్యం కారణం అయి ఉంటుంది. డాక్టర్ని చూడకపోయావా?"
"పాపం శమించుగాక! నాకనారోగ్యమేమిటయ్యా!"
"మరైతే నిద్ర ఎందుకు పట్టటంలేదో చెప్పి ఏడవచ్చు కదా మళ్ళీ నాకెందుకు పజిల్ పెట్టటం?" విసుగ్గా అన్నాను.
"ఆరులక్షలు పోసి ఇల్లు కట్టించానా. ప్రతివాడి కళ్ళూ నా యింటిమీదే! నాకేదో
దిగులుగా ఉంది."