• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Police Station Records

Police Station Records By K S Narayana Ba

₹ 180

  1. రఫ్ డ్యూటీ రోస్టర్

పోలీస్ స్టేషన్ రికార్డులు

ఈ పుస్తకము ప్రతీ పోలీసు స్టేసన్లోనూ ఉంచి జనరల్ డైరీని వ్రాయుటకు ముందు ఆ రోజు పోలీస్ స్టేసన్లో హజరుగా ఉన్న సిబ్బంది, ఇతర డ్యూటీలలో ఉ న్న సిబ్బంది, నియమించబడిన డ్యూటీలను అందు నమోదు చేసి తదుపరి జనరల్ డైరీ నందు వ్రాయుదురు.

  1. జనరల్ డైరీ

ప్రతీ పోలీస్ స్టేషన్లోనూ ఫారం 92లో ఒక డైరీని వ్రాయవలెను. ఇందు 24 గంటలు ప్రతీ రోజు పనికాలమును క్రమముగా వ్రాయవలెను. ఈ జనరల్ డైరీని కార్బన్ పెట్టి కాపీయింగ్ పెన్సిల్తో వ్రాయవలెను. సాధారణముగా ఈ జనరల్ డైరీని ఉదయం 7 గం||ల నుండి మరుచటి రోజు ఉదయం 7 గం||ల వరకు వ్రాయబడును. ఒక్కొక్కపుడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఈ జనరల్ డైరీని అచ్చటి పరిస్థితులను బట్టి ఎపుడు మొదలు పెట్టవలసినది, ఎపుడు ముగించవలసినదీ నిర్ధారించవచ్చును. జనరల్ డైరీని ప్రారంభించిన మొదట ఈ విషయములను కాలానుక్రమముగా వ్రాయవలెను.

  1. పోలీసు స్టేషన్లో ఉండెడి యావత్తు గవర్నమెంట్ సొత్తు, అనగా డబ్బు వివరములు, రైల్వే వారంట్లు, బస్ వారంట్లు వాటి నంబర్లు మరియు తుపాకులు, రివాల్వరు, తూటాల యొక్క వివరములు, అవి సరిగా ఉన్నదీ, లేనిదీ వ్రాయవలెను.
  2.  రోల్ కాల్కు హజరైన వారి నంబర్లు మరియు ఇతర డ్యూటీలలో ఉన్న వారియొక్క నంబర్లు వ్రాయవలెను.
  3. ఆ రోజు డ్రిల్లు, క్లాసు, తుపాకులు శుభ్రం చేయుట పెటిగ్ డ్యూటీని జరిపిన విషయములను వ్రాయవలెను.
  4. స్టేషన్ వాచ్గా నియమించిన పోలీస్ కానిస్టేబుల్ నంబరును వ్రాయవలెను.
  5.  ఆఫ్ డ్యూటీని ఇచ్చిన వారి నంబర్లు వ్రాయవలెను...............

  • Title :Police Station Records
  • Author :K S Narayana Ba
  • Publisher :Asia Law House
  • ISBN :MANIMN4782
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :95
  • Language :Telugu
  • Availability :instock