చూసి నేర్చుకోండి!
మొన్నీ మధ్య గల్లా అరుణకుమారి రాసిన స్వీయచరిత్ర ఆవిష్కరణ సభ తిరుపతి అమరరాజా ప్రాంగణంలో జరిగింది. వాళ్ళు వేలకోట్ల కంపెనీని నడిపేవాళ్లు. స్వదేశీ, విదేశీ ఆర్థిక సంస్థల ప్రతినిధులతో, అమెరికా, జర్మనీ, బ్రిటన్ సాంకేతిక నిపుణులతో మీటింగుల మీద మీటింగులు పెట్టే రకాలు. ఏదైనా ఒక పద్ధతిగా, ట్రాన్స్పరెంట్ అంటారే - అలా పనులు చేసే బాపతు.
ఒకరోజు నా ఫోను మోగింది. 'ఎవురూ' అంటే - చేసినామె అమరా హాస్పిటల్ యజమానురాలు డాక్టర్ రమాదేవి. మా అమ్మ రాసిన పుస్తకం ఆవిష్కరణ సభ పెట్టుకున్నాం కదా. మాట్లాడేదుంది. ఫలానా టైంకి రండి అనింది. వాకా, నాగరాజసార్లతో పాటు నేనూ పోయినాను. ఆ హాస్పిటల్, ఇల్లూ వాటిని వర్ణించలేము. వాకా ప్రసాదయితే అమరా హాస్పిటల్ సేవల అభిమాని.
డాక్టర్ రమాదేవి అక్కడ చేరిన అయిదారు మందితో మాట్లాడినవన్నీ చెప్పాల్సిన పనిలేదు. ఒకటి మాత్రం చెప్పి తీరాలి. ఆవిష్కరణ సభ రోజున పుస్తకాలు అమ్మేటప్పుడు కొనేవాళ్లందరి దగ్గరా డబ్బులు వుండకపోవచ్చు. కనుక ఫోన్ పే సౌకర్యం కల్పించాలి. అక్కడ పుస్తకాల అమ్మకానికి ప్రత్యేకం ఒక కౌంటర్ వుండాలి. అమెజాన్లో ఆన్లైన్లో పుస్తకాలు ఎలా అమ్మాలో చెప్పండని నన్నడిగింది. ఆ ఆన్లైన్ అమ్మకాల దరిద్రం గురించి నాకు అస్సలు తెలీదు. మరి మీరేదో రాస్తారంటనే, మీ పుస్తకాల అమ్మకాలు ఎలా చేస్తారు మరి అనడిగింది. Sales tax అవీ ఎలా కడతారని గుక్కతిప్పుకోకుండా రెట్టించింది. వెధవ మొహమొకటేసుకుని తలొంచుకోవడం తప్ప ఏమీ..............