• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Post Cheyyani Uttaralu

Post Cheyyani Uttaralu By Swetha Lakshmi Pati

₹ 200

కొన్నిసార్లు బాధ కూడా...
ఆనందంగా అనిపిస్తుంది
ఇంకొన్నిసార్లు ఆనందం కూడా...
బాధగా అనిపిస్తుంది.

అలాంటి ఎన్నో క్షణాలు నా జీవితంలో మీతో గడిపాను నాన్నా... వాటిలో కొన్ని ఆనందాలు మన ఇద్దరి చేతా కంటతడి పెట్టిస్తే... ఇంకొన్ని బాధలు ఇద్దరి పెదవుల పైనా చిరునవ్వులు పూయించిన జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయో కదా!

మీకు బ్రతుకుపైన ఆశ నేను కల్పిస్తే... నాకు ఆశలో ఉన్న బ్రతుకు మీరు రుచి చూపించారు.

చిన్నప్పుడు మీ వేలు పట్టుకుని మీరు చూపించిన దారిలో తప్పటడుగులు వేస్తూ మిమ్మల్ని ఎంత ఆనంద పెట్టానో... టీనేజ్లో నా అడుగులు తడబాటు మిమ్మల్ని ఎంత కలవర పెట్టిందో మీకూ నాకూ మధ్యన... నాలో నాకు కొంత యుద్ధం జరిగిన తర్వాత కానీ అర్థం చేసుకోలేకపోయాను.

కానీ మీరు మాత్రం నన్ను ఏరోజూ వేలెత్తి చూపించలేదు... చిన్న చిన్న తప్పులు చేసిన ప్రతిసారీ... వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నేర్పుతూ ప్రతీసారీ నన్ను గుండెల్లో దాచుకున్నారు. మంచికీ, చెడుకీ మధ్య ఉండే ఆ చిన్న గీతని గుర్తుపట్టటం నేర్పించారు.

అందరూ ప్రపంచంలో అన్నిటికన్నా కల్మషం లేనిది అమ్మ ప్రేమ అంటారు. కానీ నా విషయంలో ఆ కల్మషం లేని ప్రేమనీ, స్వార్థమంటూ ఎరగని ప్రేమనీ అమ్మతో పోటీగా, అమ్మని మించి నాకు ఇచ్చారు.

ప్రేమ అంటే తీసుకోవటం కాదు... ఇవ్వటం అని చూపించారు.....................

  • Title :Post Cheyyani Uttaralu
  • Author :Swetha Lakshmi Pati
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN3954
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :198
  • Language :Telugu
  • Availability :instock