• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pracheena Prapancha Charitra

Pracheena Prapancha Charitra By Dr Rk

₹ 450

మానవ పరిణామం (క్లుప్తంగా)
 

ఒకానొక కాలంలో మనుష్యులు లేరు. వృక్షాలు,జంతువులు లేవు. గ్రహాలు, నక్షత్రాలు లేనే లేవు. విశ్వాంతరాళంలోని పదార్థమంతా ఒక బిందువుగా కుదించుకుపోయి వుంది. ప్రాధమికకణాలైన ప్రోటాన్ న్యూట్రాన్లు కూడా లేని శుద్ధశక్తి రూపంలో ఆనాటి పదార్థం వుండేది. ఆ పదార్థ సాంద్రత, ఉష్ణోగ్రత అత్యధిక స్థాయికి చేరుకోవటంతో, అంతర్గత పీడనం తీవ్రమై మహావిస్ఫోటం సంభవించింది. 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని తాజా అంచనా.

ఈ ప్రేలుడు వలన పదార్థం గాలి ఊదిన బెలూన్లా విస్తరించ సాగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విస్తరణ వలన అగ్నిగోళంగా ఉండే ఆనాటి విశ్వం క్రమేపీ చల్లబడసాగింది. మొదటి కొద్ది నిముషాలలోనే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటి పరమాణువులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఈ పరమాణువులు సంయోగం చెంది అణువులుగా, పదార్థ నిర్మాణానికి ఇటుకులైన మూలకాలుగా రూపొందాయి. వాటిల్లో మొదటిది హైడ్రోజన్ మూలకం.

ఆ కాలంలో పదార్ధమంతా హైడ్రోజన్ వాయువే. అది బ్రహ్మాండమైన వాయుమేఘాల రూపంలో ఉండేది. ఈ ఆది మేఘాలు గురుత్వాకర్షణశక్తి కారణంగా ఘనీభవించ సాగాయి. గురుత్వాకర్షణశక్తి అధికమై ధర్మలశక్తిగా మారటంతో మేఘాలు పెద్ద పెద్ద నక్షత్రాలుగా మారాయి. వినువీధిలో స్వయంప్రకాశములైన నక్షత్ర మండలాలు వెలిశాయి. నక్షత్రాలు వెదజల్లే శక్తికి హైడ్రోజన్ వాయువు తరిగిపోతూ హీలియంగా మారింది. హీలియం కార్బన్,.................

  • Title :Pracheena Prapancha Charitra
  • Author :Dr Rk
  • Publisher :Janasahity Prachurana
  • ISBN :MANIMN4291
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :335
  • Language :Telugu
  • Availability :instock