• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pracheenandhralipi Puttupurvottharalu

Pracheenandhralipi Puttupurvottharalu By Dr Bellamkonda Ramesh Chandrababu

₹ 400

మొదటి అధ్యాయం

బ్రాహ్మీలిపిశాస్త్ర నేపథ్యం

| ప్రాచీన అక్షర పరిణామ దశలను వివరించే శాస్త్రమే పురాలిపిశాస్త్రం. ఈ శాస్త్రం ఆధునిక యుగ ప్రారంభంలో శాసన పరిశోధకులను ఎంతగానో ఆకర్షించింది. 19వ శతాబ్ది తొలిభాగంనుండి భారతదేశంలో లిపి పరిణామంపై గ్రంథాలు వెలువడటం మొదలైంది. తొలుత ఆర్థర్ కోక్ బర్నెల్ 1878లో ఎలిమెంట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ పేలియోగ్రఫీ అనే గ్రంథాన్ని వ్రాసారు. ఆ తరువాత 1896లో ప్రముఖ జర్మన్ పండితుడు జార్జి బూలర్ తన మాతృభాషలో ఇండియన్ పేలియోగ్రఫీ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. దానిని జాన్ ఫెయిత్ ఫుల్ ఫ్లీట్ ఇంగ్లీషు భాషలోకి అనువదించారు. బూలర్ తన గ్రంథంలో ఉత్తర, దక్షిణ భారత లిపులమధ్య కనిపించే ముఖ్యమైన వ్యత్యాసాలను చెప్పడమేకాక దక్షిణభారతదేశంలోని ముఖ్యంగా భట్టిప్రోలు బౌద్ధశాసనాలలోని లిపిని ద్రావిడలిపిగా పేర్కొన్నారు. అయితే పురాలిపిశాస్త్రంపై తొలి దేశీయ రచనను 1918లో పండిట్ గౌరీశంకర్ హీరాచంద్ ఓఝా హిందీ భాషలో భారతీయ ప్రాచీన లిపిమాల అనే పేరుతో ప్రచురించారు. అందులో ఓఝా దక్షిణ భారత లిపులను గూర్చి పరిమితంగానే చర్చించారు.

ప్రముఖ కళావిమర్శకుడు, శాసన పరిశోధకుడు అయిన డా. చెలంబూరు శివరామమూర్తి 1954లో ఇండియన్ ఎపిగ్రఫీ అండ్ సౌత్ ఇండియన్ స్క్రిప్ట్ అనే గ్రంథంలో ప్రాచీనకాలంనుండి మధ్యయుగాల వరకు ఉన్న శాసనాక్షరాల పరిణామ క్రమాన్ని గురించి వివరించారు. 1960లో నవనాలంద బౌద్ధ విశ్వవిద్యాలయ ఆచార్యులు చంద్రికాసింగ్ ఉపాసక్ ది హిస్టరీ అండ్ పేలియోగ్రఫీ ఆఫ్ మౌర్యన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో వారు బ్రాహ్మీలిపి పుట్టుకను గూర్చి ఎంతో విపులంగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అహ్మద్ హసన్దాని ఇండియన్ పేలియోగ్రఫీని 1963లో వెలువరించారు. ఈ గ్రంథంలో హసన్దాని దక్షిణ భారత లిపి పరిణామ క్రమాన్ని గూర్చి కొంతమేరకు విశ్లేషించారు. డా. టి.వి. మహాలింగం రచించిన ఎర్లీ సౌత్ ఇండియన్ పేలియోగ్రఫీ(1967) గ్రంథంలో ముఖ్యంగా తమిళ బ్రాహ్మీలిపి పరిణామంపైనే దృష్టిపెట్టడం జరిగింది. ఆ తరువాత 1971 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఠాగూర్ | ప్రసాద్ వర్మ ది పేలియోగ్రఫీ ఆఫ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఇన్ నార్త్ ఇండియా అనే చక్కటి వివరణాత్మక గ్రంథాన్ని వ్రాసారు. కాని వర్మ ఉత్తరభారత బ్రాహ్మీలిపి పరిణామ దశల వివరణకే పరిమితమయ్యారు. అయినప్పటికీ, వర్మగారి పుస్తక రచనాపద్ధతి నన్నెంతో ప్రభావితంచేసి యీ పుస్తక రచనకు తోడ్పడింది. ఏది ఏమైనప్పటికి ఆంధ్ర బ్రాహ్మీలిపిని గురించి వివరించే పరిశోధనాత్మక గ్రంథమేదీ ఇంతవరకు వెలువడలేదు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ గ్రంథం..............

  • Title :Pracheenandhralipi Puttupurvottharalu
  • Author :Dr Bellamkonda Ramesh Chandrababu
  • Publisher :VVIT, Nambur
  • ISBN :MANIMN5034
  • Binding :Hard Binding
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :274
  • Language :Telugu
  • Availability :instock