• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prachina Bharatam lo Diggaja Daarsanikulu

Prachina Bharatam lo Diggaja Daarsanikulu By Acharya Potturu Ranganayakulu P Hd

₹ 100

ఎవరీ దిగ్గజ దార్శనికులు...?
                   తత్వశాస్త్రాన్ని నిర్వచించే ప్రయత్నమిది. జ్ఞానం కోసం అన్వేషణగా; విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా; మానవజాతి నైతిక, సామాజిక బాధ్యతల పరిశీలనగా; దైవిక ఉద్దేశాలను ప్రస్తావిస్తూ మానవుల స్థానాన్ని గుర్తించే ప్రయత్నంగా; మానవ ఆలోచనల మూలం, పరిధి, ప్రామాణికతల పరీక్షగా; ఈ విశ్వంలో సంకల్పం లేదా స్పృహ కారణాల అన్వేషణగా; సత్యం,

                    మంచితనం, అందం అనే భావనల విలువలను పరిశీలించేదిగా; హేతుబద్ధత కల స్పష్టమైన ఆలోచనలను ప్రోత్సహించేదిగా; మనిషి ఆలోచన నియమాలను క్రోడీకరించే ప్రయత్నంగా తత్వశాస్త్రాన్ని నిర్వచించవచ్చు. ప్రాచ్య, పాశ్చాత్య తత్వవేత్తలు వేలాది సంవత్సరాలుగా జటిలమైన ప్రశ్నలకు సమాధానాలన్వేషించే పని చేస్తున్నారు. అనాదిగా భారత ఉపఖండంలోని తత్వవేత్తలు, వారి ఆలోచనల్లోని వైవిధ్యం, వారి తాత్వికత గురించి అసంఖ్యాకంగా రచనలు వెలువడ్డాయి. అయితే ఈ శాస్త్రంలోని ప్రాథమిక భావనలను అర్థం చేసుకోడానికి, నేటితరానికి వాటి సమకాలీనత్వాన్ని విశదపరచడానికి ఈ చిన్న ప్రయత్నం.
పాశ్చాత్య దార్శనిక చరిత్ర ఐరోపాలో గ్రీకు, లాటిన్ భాషావాజ్మయంనుంచి ప్రవహించి మధ్యయుగాల్లో మహాప్రవాహంగా మారి ఆధునిక విజ్ఞానానికి దారితీసింది. దైవం ఉందా లేదా అనేది ప్రధాన ప్రశ్న అయినా, ఈ విశాల విశ్వం అందులో భౌతిక పదార్థం ఎలా ఎందుకు ఏర్పడింది, దానికి ప్రాణం ఎలా కలిగింది, వీటి గమ్యమేమిటి అని చర్చించడం, మన జ్ఞానం ఎంతవరకూ వాస్తవం అనే ప్రశ్నలు దార్శనికంలో కేంద్రస్థానాన్ని ఆక్రమించాయి. ఈ ప్రశ్నలకు ప్రాచీన భారతీయ దార్శనికుల సమాధానాలు మీరు ఇందులో చూడవచ్చు.

                                                                                                                      -డా. పొత్తూరు రంగనాయకులు

  • Title :Prachina Bharatam lo Diggaja Daarsanikulu
  • Author :Acharya Potturu Ranganayakulu P Hd
  • Publisher :Chaaya Resource Centre
  • ISBN :MANIMN2883
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock