ఆధునిక రాజరికాలు వద్దు
క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల నాడు గ్రీకు దార్శనికుడు ప్లేటో తన 'రిపబ్లిక్' గ్రంథంలో ప్రజాస్వామ్యం ఆదర్శప్రాయం కాదని, తాత్వికుడైన పాలకుడే ఆదర్శ పాలనను అందించగలడని నొక్కి వక్కాణించాడు. ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంతో సహా ప్రజా ప్రతినిధుల పాత్ర | ప్రజాస్వామ్యంలో క్రమంగా క్షీణిస్తూ ఎక్కువమంది ఆదరణ పొందిన నాయకులు | కీలకపాత్ర వహించే క్రమం మొదలయ్యింది. ఇది ఎంతో కాలం కొనసాగదు.
పైన వున్న పాలకులెవరైనా అన్ని అధికారాలు, బాధ్యతలు స్థానిక సంస్థల వద్ద నిక్షిప్తం చేసినప్పుడు మాత్రమే కీలక వ్యక్తిగా ఎవరువున్నా పట్టించుకోని పరిస్థితి మొదలవుతుంది. ఎంత గొప్ప నాయకుడికైనా గతి తప్పే ప్రమాదం ప్రక్కనే పొంచి | వుంటుంది. అంతేకాదు. ఇంతటి భారీ పాలనా వ్యవస్థలో ఎక్కడ, ఏ తప్పు జరిగినా | దానికి మూల నాయకుడే కారణమని నిందించడం మొదలవుతుంది. ఇటువంటి ఆకస్మిక ప్రమాదాల నుండి తన్ను తాను కాపాడుకోవడానికైనా ముఖ్య నాయకుడు | తన అధికారాలన్నీ వికేంద్రీకరించాలి. గ్రామస్థాయి నుండి, నగర స్థాయి వరకు ఎంపికైన 3. స్థానిక సంస్థల ప్రతినిధులకు అధికారాలన్నీ అప్పజెప్పాలి. అలా వికేంద్రీకరించడంతో, ఈ అధికారాన్నుండి మూల నాయకుడు ఎటువంటి వ్యక్తిగత లబ్ధి పొందడంలేదన్న విశ్వాసం ప్రజల్లో మొదలవుతుంది.
ప్రపంచంలో అనేక దేశాలలో ప్రజాస్వామిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభాలకు | లోనవుతూ తమ ఉనికినే ప్రశ్నార్ధకం చేసుకొంటున్నప్పుడు, అధికారాలన్నీ క్రిందిస్థాయి | వరకు వికేంద్రీకరించి, పాలనా వ్యవస్థలో అందరినీ భాగస్వాముల్ని చేసి, సాధికారతను అందరికీ అందించిన అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఆదర్శప్రాయంగా మనకలుగుతోంది. పాలనా వ్యవస్థలకు నిరంతరం తమను తాము సవరించుకొనే, మెరుగు పరచుకొనే సౌలభ్యం లేనప్పుడు, వాటి పనితీరు క్రమంగా వెర్రితలలు వేస్తూ, | ప్రజా కంటకంగా రూపొందుతుంది. శాంతిభద్రతలు, సమగ్రత, ప్రశాంతతలకు ఏర్పడనున్న పెను ప్రమాదాన్నుండి దేశాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ | పూనుకోవలసిన తక్షణ అవసరాన్ని తెలియజెప్పే ప్రణవనాదమే ఈ పుస్తకం..............