ఆకాంక్ష
“వ్యక్తుల చరిత్రల సమాహారమే దేశచరిత్రలు"
ప్రకాశం జిల్లా ఏర్పడి 50 సం||లు పూర్తయి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో శుభకామనలతో వెలువడుతున్నడు గ్రంథం ఈ నేలతో పేగుబంధం కలిగి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విశిష్ట వ్యక్తులుగా మన్ననలందుకున్న వ్యక్తుల జీవితాలను సృజిస్తూ రచించబడినది.
ప్రకాశం జిల్లా సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రాజకీయ, చారిత్రక | రంగాలను ఉద్దీపనం చేసిన ప్రముఖుల జీవిత చిత్రమే ఈ గ్రంథం. దురదృష్ట వశాత్తు నేటి సమాజంలో రాజకీయ రంగంలోని వ్యక్తులకే అధిక ప్రచారం, ప్రాధాన్యత లభిస్తోంది. తక్కిన వారిని పూర్తిగా ఉపేక్షిస్తోంది. అలాకాక, భిన్న దృష్టి కోణంతో ఈ గ్రంథం వెలువడుతోంది.
గత రెండు దశాబ్దాలుగా అటు విజ్ఞాన శాస్త్ర ప్రచారం, ఇటు సాహితి రంగంలో కృషి చేస్తున్న ఉదయగిరి రచించిన ఈ గ్రంథాన్ని ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు, యువకులందరూ చదివి ప్రకాశం జిల్లా విశిష్టతను, గొప్పతనాన్ని అవగతం చేసుకుంటారని, ప్రకాశంజిల్లాకు చెందిన మహనీయుల స్ఫూర్తిని, త్యాగనిరతిని, సాహితీ గరిమను, పోరాట పటిమను అందరూ అలవరచు | కోవాలని ఆకాంక్ష...........