ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని ఒక రష్యన్ పైలట్ ప్రేమ కథ. యుద్ధంలో విమానం కూలిపోగా, ఎలాగో ప్రాణాలతో బయటపడి స్వస్థలం చేరుకుంటాడు. తీరా చూస్తే తన ప్రేయసి కనిపించదు. ఆమె కోసం అతను చేసిన వెతుకులాట లో ఎందరో వ్యక్తులు, భిన్న మనస్కులు సమాజంపై విభిన్న దృక్పధాలు కలవారు అతనకి తారసపడతారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వారు కొందరైతే, స్వార్థపరులు ఇంకొందరు. వీరందరినీ దాటి దేశ భక్తురాలైన తన ప్రేయసిని కలుసుకుంటాడా అనేది కథాంశం.
ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ప్రేమకథ ఈ నవల