కరోనా వైరస్ క్యాపిటలిజం క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శన, ఉదాహరణ. పెట్టుబడి ప్రపంచీకరణకూ,కొవిడ్ వ్యాప్తికి, పేదరికానికీ, కులానికి ఉన్న అంతస్సంబంధాన్ని చక్కని విశ్లేషణగా అందించిన పుస్తకం ఇది. కులాధారిత ఉత్పత్తి విధానమూ,బహుళ జాతి సంస్థలు, భారత పెట్టుబడి ముప్పేటలుగా పీడిత ప్రజలను ఎలా వెంటాడి వేధిస్తున్నాయో కొవిడ్ సంక్షోభకాలం నేపధ్యంప్రొ॥ కె.ఎస్.చలం అత్యంత ప్రతిభావంతంగా పుస్తకంలో వివరించారు. ప్రపంచ బాధితులు క్రూర పెట్టుబడికీ, దుర్మార్గ అంటువ్యాధికి వ్యతిరేకంగా ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకంమనకు గుర్తుచేస్తుంది.
ప్రొ॥ కె.ఎస్.చలం ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని ఈ దేశానికి అన్వయించి ఆచరణా మార్గాన్ని అందిస్తున్న అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరు. రాజ్యాంగ పదవి, వైస్ ఛాన్సలర్, ఆచార్య బాధ్యతలునిర్వహించారు. ఇంగ్లీష్, తెలుగు భాషలో బాదాపు 40 పుస్తకాలు, అనేక వ్యాసాలు రచించి సామాజిక ఆర్థిక అగౌలతు తరా తీయు చర్చకు తెచ్చారు.