• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prapancha Charitra

Prapancha Charitra By Dr Daggubati Venkateswarao

₹ 500

అనంత విశ్వం

ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉంటాం. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం గెలాక్సీ అయితే అటువంటి గెలాక్సీలు మరి కొన్ని కోట్లుగా ఉన్నట్లు నిర్ధారించబడింది. ఒక గెలాక్సీ పేరు మిల్కీవేవ్ లేదా పాలపుంత. అందులో ఒక మూల ఉన్న నక్షత్రం సూర్యుడు. అనగా అనంత విశ్వంలో విస్తరించిన కోట్లాది నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఆ సూర్యగోళం భూమి నుంచి 10 కోట్ల మైళ్ళ దూరంలో | ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ శక్తిని వెదజల్లుతూ ఉంది. సూర్యుని వ్యాసాన్ని 8,66,000 మైళ్ళుగా లెక్కవేశారు.

సూర్య మండలంలో గ్రహాలు 9 కాగా 9 వ గ్రహమైన ఫ్లూటో ఆధునికంగా తొలగింపబడింది. సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ, కోట్ల సంవత్సరాలుగా వాటి వాటి కక్ష్యలో తిరుగుతున్నాయి. సూర్యుడి చుట్టూ ఆవరించి ఉన్న అసంఖ్యాక రేణువులు (కాస్మిక్ డస్ట్) కాలక్రమంలో గ్రహాలుగా రూపాంతరం చెందాయి. ఈ గ్రహాల్లో ప్లూటో సూర్యునికి దూరం గాను, బుధుడు (మెర్యురి) దగ్గరగాను ఉన్నాయి. సూర్యునికి దగ్గరలోని రెండవ గ్రహం శుక్రుడు (వీనస్). ఇది అగ్ని పర్వతం లాగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 460 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది సూర్యుని చుట్టూ తిరగటానికి 225 రోజులు పడుతుంది. పరిమాణం భూమికి సమానంగా ఉంటుది. మూడవది భూమి. భూమి...............

  • Title :Prapancha Charitra
  • Author :Dr Daggubati Venkateswarao
  • Publisher :Nivedita Publications
  • ISBN :MANIMN3740
  • Binding :Hard binding
  • Published Date :Oct, 2022
  • Number Of Pages :324
  • Language :Telugu
  • Availability :instock