ఇది మానవజాతి చరిత్ర
మా ఊరి టెంటు సినిమాలో నేను చిన్నప్పుడు చూసిన తెలుగు సినిమానే నాకు మొట్టమొదట తెలిసిన సినిమా. చదువు కోసం మద్రాసు వచ్చిన తరువాత హిందీ, ఇంగ్లీషు సినిమాలు పరిచయమయ్యాయి. చాలా సంవత్సరాల వరకు సినిమాలంటే ఇవే అనే భ్రమలో ఉండేవాణ్ణి. 1951లో మొట్టమొదటిసారి మద్రాసులో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగినప్పుడు తెలిసొచ్చింది సినిమా విశ్వరూపం ఏమిటన్నది. Yukiwariso, Rashomon, Bycicle Theives, Umbrellas of Cherbourg లాంటి సినిమాలు చూసేసరికి ఒక్కసారిగా సినిమాల మీద నాకున్న దృక్పధం పూర్తిగా మారిపోయింది. ఇదొక గొప్ప కళ. మానవజాతిని ముందుకు నడిపించే శక్తి గల కళ. అప్పట్నుంచి, ప్రపంచంలో ఏ ఏ మూల ఏ ఏ సినిమాలు వున్నాయో వెతకటం మొదలుపెట్టాను.
ఆ సమయంలో Marie Seton మద్రాసు వచ్చారు. ఆమె ఐసెన్స్టీన్ (Eisenstein) శిష్యురాలు. సినిమా మీద ఎంతో పరిశోధన చేసారు. ఆమెను నేను కలిసాను. రష్యన్.......................