₹ 100
“ఊహించు. పరిష్కారం దానికదే లభిస్తుంది!' అంటారు విజ్ఞులు, 'కలలు కను, వాటికి వాస్తవ రూపం తీసుకురా!' అంటాడు మరో శాస్త్రవేత్త.
బాల బాలికల్లో ఊహాశక్తిని పెంచడానికి, తద్వారా వాస్తవ జీవితం మీద మరింత అనురక్తి పెంచడానికి, జీవిత సమస్యల పరిష్కారానికి మార్గం చూపడానికీ, 'చందమామ' కథల పత్రిక చేసిన మహోపకారం ఇంతా అంతా కాదు.
సాహిత్యపరంగా పత్రిక వృద్ధి చెందుతూనే సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేయడంలో అది గొప్ప పాత్ర వహించింది.
అచ్చగా ఈ పుస్తకంలో ఉన్న కథల వంటి వాటినే ప్రచురించి చందమామ, అంతటి బృహత్తర బాధ్యతను నెరవేర్చగలిగింది. ఆ పత్రికలేని లోటును తీర్చడానికే ఇటువంటి పుస్తకాల ప్రచురణ.
ఒక పట్టణమంతా ఎలుకలతో నిండిపోయింది.. ఎలుకలను పారద్రోలడమెలా వంటి సమస్యాత్మక కథ నుండి సముద్రంలో నేటికీ ఒక తీరగలి దాక్కుండి, ఉప్పును విసురుతున్న ఉదంతం వరకూ సంపుటీకరింపబడిన కథలు అన్నీ ఆలోచన కలిగించేవే!
పుస్తకంలో పుటలు తిప్పడం మొదలు పెడితే ఆపలేని విధంగా శైలి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. చందమామ కథలను స్ఫురణకు తీసుకు రావడం ఒక అనివార్యత కూడాను.
- Title :Prapancha Pillala kathalu
- Author :M V V Satyanarayana
- Publisher :M V V Satyanarayana
- ISBN :MANIMN2505
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock