• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pravasamlo Prathighatana

Pravasamlo Prathighatana By Mukunda Ramarao

₹ 150

ఒక కవి దృష్టిలో ...

'కుండపోత వర్షంలో ఏదో ఉంది / నాకది ఏడవడం సరైందన్నట్టు చేస్తుంది .... అని, భారతదేశంలో దశాబ్దాలుగా శరణార్థిగా నివసించిన తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకుంటూ త్రిభాషా కవయిత్రి సోనమ్ త్సోమో రాసింది. ప్రయాణ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న సోనమ్, తన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయింది.

'వాస్తవం కారణంగా ఒంటరిగా ఉండటం మనకు తెలిసినవి చాలా ఉన్నప్పటికీ/ పంచుకోగల వ్యక్తులు ఎవరూ లేక -/ భవిష్యత్తు కోసం ఆశలు లేదా ప్రణాళికలు -/ గత జ్ఞాపకాలైనా...' అని టిబెట్లో పుట్టి అరవై ఐదు సంవత్సరాలకు పైగా ప్రవాసంలో నివసించిన లాసాంగ్ త్సెరింగ్ రాశాడు.

'పుట్టినప్పటి నుండి, మేము ఏడుస్తున్నాం. అంచాత మేము మా భారాలను మా వీపు మీదే మోస్తున్నాం. కానీ మేమిలా శాశ్వతంగా నడవలేం/ ఎప్పుడో ఒక రోజు మేము భూమిమీద విశ్రాంతి తీసుకుంటాం,' అని చెబుతుంది అమెరికాలో పుట్టి పెరిగిన కవయిత్రి లెకీ, తాను ప్రతిరోజూ టిబెట్ భాష, సంస్కృతికి దూరంగా ఉన్నానని గుర్తుచేసుకుంటూ.

రాజకీయ అణచివేత వలనో, ఆర్థిక పరిస్థితుల వలనో తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి జీవించే వారికి, బాధను, తపనను, ఒంటరితనాన్ని వ్యక్తీకరించేందుకు - కవిత్వం ఒక కీలకమైన ఉపకరణం. సోనం, ల్సాసంగ్, లెకీ, ఇంకా అనేకమంది టిబెట్ శరణార్థుల కోసం, కవిత్వం ఒక దృఢమైన మాధ్యమంగా మారింది. వారి లోతైన అనుభవాలను పదబద్ధం చేసి, భావోద్వేగాలను సమగ్రంగా ప్రతిబింబించే శక్తిగా నిలుస్తోంది........................

  • Title :Pravasamlo Prathighatana
  • Author :Mukunda Ramarao
  • Publisher :Pracchaaya
  • ISBN :MANIMN6639
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2025
  • Number Of Pages :124
  • Language :Telugu
  • Availability :instock