₹ 100
వేకువజామున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. హైదరాబాద్ నుండి బయలుదేరిన సింహపురి ఎక్సప్రెస్ వేగంగా వెళుతోంది. ఆ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న విరిజ, ఎదురు సీటులో కూర్చున్న ఆవిడ హడావుడిగా సామాను సర్దుకోవడం చూసి నవ్వుకుంది.
సింహపురి స్టేషన్ కు ట్రైన్ చేరుకుంటుందని గ్రహించి విరిజ తన బాగ్ సర్దుకుని లేచి నిలుచుంది.
"అదేమిటిమ్మాయ్.. అప్పుడే దిగేందుకు లేచి నిలుచున్నావ్? ఇంకా టైంపడుతుంది. మేము కూడా నెల్లూరు స్టేషన్లోనే దిగేది. అప్పుడే లేచావేంటి కూచో" అంది ఎదురు సీట్లో కుర్చున్నావిడ.
ఆమెని... ఆమె చుట్టూ వున్నా బ్యాగుల్ని చూసి 'అమ్మో! ఎంత లగేజి.. ఇదంతా దించేందుకు ఎంత టైం పడుతుందో... నెల్లూరు స్టేషన్లో ఎక్కువ టైం ఆగదు. త్వరగా దిగు అని చెప్పింది విమల. వెళ్ళి ముందే తలుపు దగ్గరగా నిలుచుంటే మంచిదేమో! చివరికి తను దిగేందుకు వీలుకాకపోతే కష్టం' అనుకుంది విరిజ.
-ఎన్.పూజిత.
- Title :Prema Tirpulo Tenejallu
- Author :N Poojitha
- Publisher :Sahithi Publishers
- ISBN :MANIMN0559
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :224
- Language :Telugu
- Availability :instock